అమెరికాలో ఉంటున్న భారతీయులకి కరోనా ఇచ్చిన షాక్ అంతా యింతా కాదు. అమెరికాలో ఉంటున్న చాలామంది ఎన్నారైలు  భారత్ వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే భారత్ భారతీయుల కోసం వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ లో భాగంగా విదేశంలో ఉన్న వారిని స్వదేశానికి పంపుతున్నారు. ఈ సమయంలో ఎన్నరైలకి కొత్త చిక్కొచ్చిపడింది. ఇండియా వచ్చే ఏర్పాట్లు భారత్ ప్రభుత్వం చేసినందుకు సంతోష పడాలా లేదా గతంలో భారత్ పెట్టిన కండిషన్లు ఇప్పుడు శాపంగా మారినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థతిలో ఉన్నారు..

 

వీసా అవసరం లేకుండా భారతీయులని ఇండియా రప్పించేందుకు అవకాశం కల్పించే ఓఐసి కార్డులపై గత నెలలోనే నిషేధం విధించింది భారత ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని నిలువరించే క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలపై ఆంక్షలు విధించడంతో ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్నయయమే అమెరికాలో ఉంటున్న భారతీయులకి పెద్ద చిక్కు  తీసుకు వచ్చింది. వీసా గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళందరూ ఓఐసి కార్డ్ పరిధిలోకి వస్తారు. వారు పుట్టడమే అమెరికా దేశంలో పుట్టడంతో సహజంగానే వారికి అమెరికా పౌరసత్వం దక్కుతుంది. అందుకే వారు ఓఐసి కార్డ్ కి అర్హులు అవుతారు. ఈ పరిణామాల కారణంగా పిల్లలు ప్రయాణాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు..కానీ పిల్లల తల్లి తండ్రులు మాత్రం భారత్ వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నారు..

 

ఈ పరిణామాలతో ఒక్క సారిగా షాక్ అవుతున్నారు ఎన్నారైలు. కేంద్రం వందే భారత్ మిషన్ ఏర్పాటు చేసిన ఎన్నరైలని ఇండియాకి తీసుకువెళ్తుంటే..కేంద్ర నిభందన ఎన్నరైలకి తీవ్ర నిరాసాని మిగుల్చుతోంది. సొంత గడ్డకి వెళ్ళిపోతున్నామనే సంతోషంతో ఎంతో ఉశ్చాహంగా విమానాశ్రయాలకి వెళ్ళిన భారతీయ ఎన్నారైలని పరిసిలిస్తున్న సిబ్బంది ఓఐసి కార్డ్ ఉన్న పిల్లలని విమానం ఎక్కనివ్వక పోవడంతో పిల్లల తల్లి తండ్రులు కూడా నిరాశతో వెను తిరుగుతున్నారు. ఒక పక్క కరోనా కారణంగా మానసిక ప్రశాంతతని కోల్పోయిన అమెరికాలోని భారత ప్రజలు తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: