చైనా తమ దేశంలో చనిపోయిన వారి సంఖ్య తక్కువ చేసి చెప్తోంది ప్రపంచంలో కరోనా కారణంగా చనిపోయిన వారిలో అత్యధిక శాతం చైనా వాసులే అంటూ అమెరికా కొంత కాలంగా గొంతు చించుకుంటోంది. ఇదే విషయాన్ని ప్రపంచం ముందు చూపించి చైనా పై వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ గురివింద గింజకి నలుపు తెలియదన్నట్టుగా అమెరికాలో అసలు లెక్కలు గురించి ఇప్పుడు బయట పడింది..

 

అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ పౌచీ నిన్నటి రోజున మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. అమెరికాలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 83 వేల మంది మృతి చెందారని, 14 లక్షల మంది కరోనా బారిన పడ్డారని అమెరికా చూపిస్తున్న లెక్కలు నిజం కావని కుండ బద్దలు కొట్టారు పౌచీ. అమెరికాలో చాలామంది మృతి చెందారని ఎన్నో మరణాలు లెక్కలలోకి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా కారణంగా మృతి చెందిన వారు దాదాపు 1.20 వేల పై మాటే అంటూ ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు..

 

న్యూయార్క్ వంటి నగరంలో కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని దాంతో బాధితుల్ని చేర్చుకోవడానికి ఆసుపత్రులలో ఖాళీలు లేవని ఈ కారణంగానే ఎంతో మంది కరోనా బాధితులు ఇళ్లకే పరిమితం అయ్యారని. అలాంటి వాళ్ళు చనిపోయి కూడా ఉండవచ్చని ఆయన ప్రకటించారు. అలాంటివి అధికారిక లెక్కలోకి రాలేదని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పౌచీ చేస్తున్న వ్యాఖ్యలు అమెరికా పరిస్థతికి అడ్డం పడుతున్నాయని ఆగస్టు నాటికల్లా ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇదిలాఉంటే పౌచీ లాంటి కీలక వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ని మరో సారి చిక్కుల్లోకి నెట్టడం ఖాయమని ఇది ట్రంప్ కి తీవ్ర ఇబ్బందికరమైన విషయమని ట్రంప్ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిందేనని అంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: