
ఎన్నికల సమయంలో వలసవాసులకు షాక్ ఇస్తూ గ్రీన్ కార్డ్ , వర్కింగ్ వీసాలపై ఆంక్షలు విధించిన విషయం విధితమే. అయితే ఈ నిషేధం డిసెంబర్ 31 తో ముగియనున్న తరుణంలో ట్రంప్ మరో సారి తన బుద్ది చూపించాడు. ఈ నిషేధాన్ని మార్చి 2021 వరకూ పోడిగిస్తున్నట్టుగా తాజాగా ఉత్తరువులు జారీ చేశారు. ఈ పరిణామాలతో అమెరికాలో ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తున్న ఎంతో మంది నిపుణులు షాక్ తిన్నారు. ఎన్నో నెలల విరామం తరువాత తమ కలలు నెరవేరుతాయని అమెరికాలో ఉద్యోగం సాధిస్తామని ఎదురు చూస్తున్న వలసవాసులను ట్రంప్ ఇరకాటంలోకి నెట్టేశారనే చెప్పాలి. ఇదిలాఉంటే

జనవరి 20 వ తేదీన శ్వేతసౌధం వదిలి వెళ్ళాల్సిన ట్రంప్ ఉన్న పళంగా హుటాహుటిన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఊహలకు అందకపోయినా నిపుణుల అంచనాల ప్రకారం. అమెరికా కరోనా మహమ్మారి గతంలోకంటే ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చుతోందని, భవిష్యత్తులో అమెరికన్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని అందుకే అమెరికన్స్ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయంట్రంప్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంపై అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ మాత్రం ఫైర్ అవుతున్నారు. తాను అధికారంలోకి రాగానే ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు తొలగిస్తానని, హామీ ఇచ్చారు...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి