
ట్రంప్ పిలుపు మేరకు అమెరికా నలుమూలల నుంచీ ఎంతో మంది అమెరికన్స్ వాషింగ్టన్ చేరుకున్నారు. ర్యాలీ గా వచ్చిన ట్రంప్ మద్దతు దారులు అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బలగాలు చేసిన కాల్పులలో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో వైట్ హౌస్ కీలక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో జరుగుతున్న ఘర్షణలు ఎంతో బాధించాయని, ఈ పరిణామాలపై తాము ఎంతో కలత చెందామని, అందుకు నిరసనగానే వైట్ హౌస్ లోని తమ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఇలా రాజీనామా ప్రకటించిన వారిలో మేలానియా ట్రంప్ కార్యదర్శి గ్రిషామ్ ముఖ్యులుగా ఉండగా, వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ మాధ్యూస్ కూడా ఉన్నారు. వీరిద్దరితో పాటుగా మరికొందరు కూడా త్వరలో రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ట్రంప్ ఈ నిరసనలను ప్రోశ్చహించడం తమకు ఏ మాత్రం నచ్చలేదని అమెరికా క్యాపిటల్ పై దాడి జరగడంలో ట్రంప్ ఓ అధ్యక్షుడిగా ఉంటూ ప్రాధాన పాత్ర పోషించారని అమెరికన్స్ ఆవేదన చెందుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి