ఎలన్ మస్క్.. బహుశా ఆయన గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. కానీ టెక్నాలజీని బాగా వంట పట్టించుకున్న వారికి ఈయన పేరు వింటేనే టెస్లా, స్పేసె ఎక్స్ గుర్తుకొస్తాయి. ఇకపోతే ఈ రెండింటి అధినేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎలన్ మస్క్. అయితే తాజాగా ఈయన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన మాటను నేటి యువతరానికి తెలుపుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు..


ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గానటించిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో ఉండే డైలాగులు అలాగే ప్రతి సన్నివేశం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకొని.. ఆ ఊరి యొక్క యోగక్షేమాలు చూసే ఎన్నారైగా మనకు కనిపిస్తాడు. ఇక ఈ సినిమా తరువాత చాలామంది లో ఇన్స్పిరేషన్ కలిగి ఎంతో మంది యువ హీరోలు కూడా గ్రామాలను దత్తత తీసుకుని ఇప్పటికీ వాటి బాగోగులు చూసుకుంటూ ఉండటం గమనార్హం.

సరిగ్గా ఈ సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక మాటను తూచా తప్పకుండా మస్క్ చెప్పడం గమనార్హం.. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్    లెక్స్ ఫ్రీడమినీ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని సలహాలను విద్యార్థులకు కూడా తెలియజేశారు.. ఆయన మాట్లాడుతూ ఏదైనా సరే సాటి మానవులకు పనికివచ్చే పనులు మాత్రమే ఈ తరం యువత చేస్తే చాలా బాగుంటుంది అని..మనం సమాజం నుంచి ఎంతో లబ్ది పొందుతున్నాము కాబట్టీ  అంతకంటే రెట్టింపు స్థాయిలో సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు..


ఇక శ్రీమంతుడు సినిమాలో అయితే మహేష్ బాబు డైలాగ్ తిరిగిచ్చేయాలి లేకపోతే మనం లావైపోతాము అనే మాటలను గుర్తు చేస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మస్క్  మాటలకు హితవుపలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: