మాకు యుద్ధం చేసే ఉద్దేశం లేదు అంటూ చెబుతుంది రష్యా.  కానీ రష్యా యుద్ధానికి సిద్ధమైందని.. ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉంది అని చెబుతుంది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం. అదే సమయంలో ఇక రష్యా యుద్ధానికి సిద్ధంగా ఉంది అంటూ అటు బ్రిటన్ ప్రధానమంత్రి కూడా గతంలో చెప్పారు. దీంతో రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఒకవేళ ఉక్రెయిన్ పై దాడి చేయాలి అనుకుంటే మాత్రం మూడు మార్గాలు ఉన్నాయి అని అంటున్నారు  నిపుణులు.ఇక మూడు మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.



 బెలారస్ మార్గం : ఉక్రెయిన్ ప్రభుత్వం లో సమూల మార్పులు తీసుకురావాలని రష్యా కోరుకుంటే ఉత్తరం నుంచి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బెలారస్ వైపుగా 30 వేల సైనికులను మోహరించింది రష్యా. ఇక స్వల్ప శ్రేణి క్షిపణులను రాకెట్లను సహా మరికొన్ని యుద్ధ విమానాలను కూడా యుద్ధ విన్యాసాలు కోసం మోహరించడం గమనార్హం.


 క్రిమియా మార్గం : ఒకవేళ రష్యా వెనక్కి తగ్గకుండా దాడి చేయడానికి సిద్ధమైతే క్రిమియా మార్గం ద్వారానే దండయాత్ర చేయడం ఖాయం అంటూ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటెజిక్ స్టడీస్ చెందిన బెన్ హరి అంటున్నారు. ఇక ఈ మార్గం గుండా శక్తివంతమైన ఆయుధాలతో ఫిరంగుల సహాయంతో వేగంగా రష్యా ఉక్రెయిన్ లోకి చొచ్చుకు పోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. ఇక ఈ మార్గం గుండా దాడి చేస్తే నల్ల సముద్రంలో ఉన్న నావికా దళాలను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలా పశ్చిమాన తూర్పున ఉత్తరదిశ లతోపాటు క్రిమియా లో దళాలను మోహరించారు అంటే ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా చుట్టినట్లు అవుతుందని అంటున్నారు  నిపుణులు.


 తూర్పు మార్గం : రష్యా మద్దతు ఉన్న తిరుగుబాటుదారులు 2014లోనే కీలకమైన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. రష్యా కు మద్దతు ఉన్న పదిహేను వేల మంది వేర్పాటు దారులు అక్కడ ఉన్నారు. ఇక వీరి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రోస్తోవ్ ప్రాంతంలో పది వేల మంది సైనికులు ఉండగా మరికొంత మందిని తరలించింది రష్యా. ఒకవేళ తూర్పు వైపు నుంచి రష్యా దాడి చేయాలని ప్రయత్నిస్తే ఉక్రెయిన్ ఆగ్నేయ తీరం వెంబడి హ్యాండ్ బ్రిడ్జి  తయారుచేసి దాని ద్వారా క్రిమియా లోకి ప్రవేశించే అవకాశం ఉందట.  అయితే తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో రష్యన్ మాట్లాడే వారిని రక్షించాలి అనుకుంటే మాత్రమే ఇలా తూర్పు వైపు నుంచి దాడి చేసే అవకాశం ఉందని అంటున్నారు రక్షణ నిపుణులు. ఇక ఉక్రెయిన్ చేసే ఏ దాడి అయినా  రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా జరుగుతుందనిమరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: