ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. యుద్ధం చేసే ఉద్దేశం లేదు అంటూ మొన్నటివరకు డబ్బులు గేమ్ ఆడిన రష్యా ఊహించని విధంగా చిన్న దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే ఇక అగ్ర దేశమైన రష్యాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రస్తుతం పసికునా లాంటి ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అయితే మొదటి రోజు ఇక ఉక్రెయిన్లోని  కీలకమైన సైనిక స్థావరాలపై దాడి చేసిన ఇక రెండవ రోజు మాత్రం కీలక నగరాలపై దాడులు చేయడం మొదలు పెట్టింది. ఎక్కడ వెనకడుగు వేయకుండా యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది రష్యా.


 దీంతో ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే రష్యా భీకరమైన దాడి నేపథ్యంలో ఎన్నో హృదయ విదారక ఘటన వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది కనీసం భార్య పిల్లలను అయినా రక్షించు కోవటానికి సురక్షిత ప్రాంతాలకు పంపుతున్న ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నగరాన్ని ఇప్పటికే హస్తగతం చేసుకుంది రష్యా ఆర్మీ.


 క్రమ క్రమంగా ఉక్రెయిన్ లో ఉన్న కీలక నగరాల్లో కూడా  ఆక్రమించుకునేందుకు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది రష్యా ఆర్మీ. అడ్డొచ్చిన ఉక్రెయిన్ సేనలు అన్నింటినీ కూడా నిలువరించి ముందుకు సాగుతోంది. దీంతో ప్రస్తుతం ఈ నగరం మొత్తం రష్యా హస్తగతం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక రష్యా బలగాలు ఆక్రమించుకున్న నేపథ్యం లో ఉక్రెయిన్ అధ్యక్షుడు దేశం విడిచి పారి  పోయాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడూ తాను ఉక్రెయిన్లోనే ఉన్నానని ఎక్కడికి పారిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri