ఎంతో బలవంతుడైన రష్యా బలహీనమైన ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూ ఉండడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా ప్రస్తుతం యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతు ఉండటం గమనార్హం. ప్రపంచ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధిస్తూ ఉన్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దాదాపు గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనే చెప్పాలి.



 అయితే అటు ఉక్రెయిన్ ఆర్మీ ఎక్కడ తల వంచకుండా రష్యా ఆర్మీ కి దీటుగా బదులు చెప్పేందుకు సిద్ధం అయినప్పటికీ రష్యా బలగాలతో పోల్చి చూస్తే తక్కువ శక్తి కలిగిన ఉక్రెయిన్ ఆర్మీ ప్రస్తుతం విలవిల్లాడిపోతోంది. దీంతో ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా బాంబుల దాడితో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇలా రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఎన్నో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఒకవైపు బాంబుల మోతలు ప్రాణభయం మధ్య ఉక్రెయిన్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన ఓ గర్భిణి ఇటీవలే ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే యుద్ధం సమయంలో శిశువు శాంతి ని తీసుకురావాలని అక్కడి వారు ఆకాంక్షించారు. ఇక సదరు ఆడపిల్లకు హోప్ అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే ఉక్రెయిన్ పై అటు రష్యా యుద్ధ విమానాలతో విరుచుకు పడుతున్న నేపథ్యంలో దాదాపు 50 లక్షల మందిఇతర దేశాలకు వెళ్లి పోయారు అని ఐక్యరాజ్యసమితి గుర్తించడం గమనార్హం. ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధం రానున్న రోజుల్లో ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: