ఇలాంటి సమయంలోనే ఇక ఉక్రెయిన్లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది అనే విషయం తెలిసిందే. ఇలాంటి ఈ సమయంలో చిన్న దేశం అయినప్పటికి వెనకడుగు వేయకుండా వ్యూహాత్మకంగానే యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్. ఇప్పటికే వేల సంఖ్యలో రష్యన్ సైనికులు హతమార్చామని వందల సంఖ్యలో యుద్ధ విమానాలను కూడా కూల్చేసాము అంటూ స్టేట్మెంట్ ఇస్తోంది. ఇటీవలే ఈ రష్యా కు సంబంధించిన కీలకమైన టువంటి ఆర్మీ అధికారి హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోమరింత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న రష్యన్ సైనికులు ఉక్రెయిన్ పై మరింత విరుచుకుపడుతున్నారు.
ఇలాంటి సమయంలోనే రాత్రిపూటకూడా బాంబుల వర్షం కురిపిస్తున్నారు అన్నది తెలుస్తుంది. జనావాసాల పై కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా దాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా ఏకంగా ఉక్రెయిన్ పై 500 కిలోల బాంబులతో దాడులు చేస్తూ మారణహోమం సృష్టించడానికి ప్రయత్నిస్తుంది అంటూ ఉక్రెయిన్ రక్షణశాఖ చెప్పడం గమనార్హం. జనావాసాల పై దాడి చేసిన నేపథ్యంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ దేశాలు తమకు యుద్ధ విమానాలు సహాయం చేయాలని రష్యాను దీటుగా ఎదుర్కొంటాం అంటూ ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తూ ఉండటం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి