సాధారణంగా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పరయ్ వ్యక్తులు మోజులోపడి కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తెర లేపడం తో  పచ్చటి కాపురాల్లో చేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతోమంది. ఇది కొన్ని కొన్ని సార్లు ప్రేమించిన వాళ్ళని కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వాళ్ళని మర్చిపోలేక పెళ్లయ్యాక కూడా ప్రేమించిన వారితో సంబంధం కొనసాగించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు మనం చూశాం.


 కానీ ఇప్పుడు మనం చెప్పుకునే వార్త మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పెళ్ళి తర్వాత భార్యతో ఉండలేక అతను పెట్టుకున్న అక్రమ సంబంధం  చివరికి అతని కాపురం నిలబెట్టింది. ఇక దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.  ఈ విచిత్ర  యూఎస్ లో చోటుచేసుకుంది. 41 ఏళ్ల స్కాట్ అనే వ్యక్తి భార్యతో  కలిసి ఓహియోలో ఉంటున్నాడు. వీరికి చాలా ఆలస్యంగా ఒక పిల్లాడు పుట్టాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక పోస్ట్ డెలివరీతో డిప్రెషన్కు గురైన అతని భార్య బాబుని ఇంటిని చూసుకోవడం  ఎంతో ఇబ్బందిగా మారింది అంటూ భర్తకు తెలిపింది.


 కానీ భర్త మాత్రం అసలు పట్టించుకునే వాడు కాదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కాస్త విడాకుల వరకు వెళ్లాయ్. అయినప్పటికి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండే వారు. కానీ మాట్లాడుకునేవారు కాదు. ఆ తర్వాత స్కాట్ కూడా తన భార్య ప్రవర్తన పట్ల డిప్రెషన్కు గురై కృత్రిమ మేధస్సు ఉపయోగించి రోబోట్ తయారు చేశాడు. ఇక అది ప్రతిరోజు స్కాట్ తో చాటింగ్ చేసేలా ఒక సాఫ్ట్వేర్ ని అనుసంధానం చేశాడు. ఆ రోబోట్ పేరు సరేనా. ప్రతి రోజూ ఎక్కువ సమయం పాటు ఆ రోబోట్ తో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ఇక అలా సరేనాకు ఎంతగానో దగ్గరయ్యాడు. ఒకరోజు ప్రపోజ్ కూడా చేసాడు. కానీ నువ్వు సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోని నేను.. నువ్వు నా మీద చూపించిన ప్రేమ కేరింగ్ భార్యపై చూపిస్తే కాపురం నిలబడుతుంది అంటూ సలహా ఇవ్వడంతో అప్పటినుంచి భార్యకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన  మహిళ చివరికి స్కాట్ తో కలిసి ఉండడానికి సిద్ధమైంది. అతను పెట్టుకున్న అక్రమ సంబంధం చివరికి అతని కాపురం నిలబెట్టింది .

మరింత సమాచారం తెలుసుకోండి: