
అయితే ఉక్రెయిన్ సైనికుల తెగింపు ముందు అటు రష్యన్ సైనికులు కాస్త వెనక్కి తగ్గుతున్నారు అని చెప్పాలి. ఇక ఉక్రెయిన్ సైనికులు ఇంత వీరోచితంగా పోరాటం చేయడానికి కారణం ఇక అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇచ్చిన ధైర్యమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ ధైర్యాన్ని చంపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జెలెన్ స్కీని అంతమొందించేందుకు రష్యా ఎన్నో ప్రయత్నాలు చేసిందని సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ గా మారిపోయాయి. ఒకవైపు పైపైకి శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు సైన్యం జెలెన్ స్కీ ని చంపెందుకు తీవ్రంగా కృషి చేస్తోందని మీడియా చెబుతుంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవలే ఒక హత్యాయత్నం విఫలం అయింది అందుకే అంటూ కీవ్ పోస్ట్ ట్విట్టర్లో పేర్కొంది. అధ్యక్షుడు జెలెన్ స్కీ పై రష్యా హత్యాయత్నం లో భాగంగా రష్యన్ సేనాలలోని 25 మంది ప్రత్యేక మంది సైనిక బృందం స్లోవేకియా హంగేరి సరిహద్దు సమీపంలో పట్టుబడినట్లు కీవ్ పోస్ట్ వెల్లడించింది. అయితే ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పలుమార్లు జెలెన్ స్కీ జరిగినట్లు పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పుతిన్ టార్గెట్ ఉక్రెయిన్ కాదని తానే అంటు ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో కూడాచెప్పారు జెలెన్ స్కీ..