సోషల్ మీడియా కారణంగా ఎక్కడో ప్రపంచం నలుమూలల్లో జరిగిన ఘటనలు కూడా క్షణాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని రకాల ఘటనలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా మతిమరపు తో బాధపడుతున్న వారు బంధువులను  కాదు సొంత వాళ్లను కూడా కొన్ని కొన్ని సార్లు మర్చిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో మతిమరుపు అనేది ఎంతో మందిలో కనిపిస్తున్న సమస్య గా మారిపోయింది. ఇక్కడ ఒక 66 ఏళ్ల వ్యక్తి తన మతిమరుపు తో కుటుంబ సభ్యులకు షాకిచ్చాడు.



 66 ఏళ్ల ఐరిష్ అనే వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన మొబైల్ చూశాడు. అందులో డేట్ చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. అరే ముందు రోజు నా పెళ్లి రోజు కదా.. అది ఎలా మరిచిపోయానబ్బా అని అనుకున్నాడు ఇక ఇదే విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకు అంటారా.. ఆ ముందు రోజే అతని పెళ్లి రోజు అని అందరికి తెలుసు కాబట్టి.. సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇక ఎంతో ఘనంగా జరిగిన పెళ్లి వేడుక సదరు వ్యక్తికి మతిమరుపు కారణంగా మరిచిపోయాడు. అయితే ఆ సంఘటనలు భర్త ఎలా మర్చిపోయాడో కూడా భార్యకు అర్థం కాలేదు.


 ఈ క్రమంలోనే ముందు రోజు జరిగిన పెళ్లి రోజు వేడుకలను గుర్తు తెచ్చేందుకు అటు భార్య పిల్లలు అందరు కూడా ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పాలి. ఇతని పేరు వయస్సు పాత విషయాలను మాత్రమే ఆ వ్యక్తి బాగా గుర్తు పెట్టుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే అతని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు కాగా దీన్ని వైద్యుల స్వల్పకాలిక మతిమరుపు అంటూ పేర్కొన్నారు. ఇక ఇలా చివరకు 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. 2017 లో కూడా ఇలాంటి సమస్యకు ఇతను గురయ్యాడని ఆ సమయంలో కూడా భార్యతో శృంగారం చేసిన తరువాత ఇలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Sex