సాధారణంగా విమాన ప్రయాణాలు ఎక్కువ మంది ఇష్ట పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే  బస్సు రైలు ప్రయాణం కంటే విమాన ప్రయాణం ద్వారా గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు. అదే సమయం లో ఎంతో అనుకూలమైన వాతావరణం లో విమాన ప్రయాణం ఉంటుందని భావిస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే  కాస్త ఖర్చు ఎక్కువైనా సరే విమాన ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారూ. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఉండే ఏకైక ఆప్షన్ విమానం మాత్రమే. అయితే ఇలా విమాన ప్రయాణం చేస్తున్న సమయం లో కొన్ని కొన్ని సార్లు ప్రయాణికులకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.


 కొన్నిసార్లు విమానం లో సాంకేతిక సమస్యలు తలెత్తడం కారణం గా విమానం ల్యాండ్ అవడానికి ఇబ్బందులు ఎదురు కావడం జరుగుతుంది. మరికొన్ని సార్లు పైలెట్ తప్పిదాల కారణం గా విమానాలు ప్రమాదానికి గురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. విమానాన్ని నడిపిస్తున్న పైలెట్ ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాలి.   ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ చేస్తూ విమానాన్ని   గమ్య స్థానానికి చేర్చాలీ. కానీ కొంతమంది పైలెట్లు మాత్రం కాస్త నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే చేశాడు ఒక పైలెట్.


 ఎంతో మంది ప్రయాణికుల తో బయలు దేరిన విమానాన్ని గమ్యస్థానానికి చేరుకుంటుందన్న సమయంలో పైలెట్  హాయిగా నిద్రపోయాడు. దీంతో విమాన ప్రయాణికులు అందరూ భయాందోళనలో మునిగిపోయారు.. న్యూయార్క్ నుంచి రోమ్ వెళ్తున్న ఐటిఏ ఎయిర్ లైన్స్ కు చెందిన జెయే609 విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం నడిపే పైలట్ నిద్రపోయాడు. పది నిమిషాలపాటు కమ్యూనికేషన్ జరగలేదు. ఇక ఫ్రాన్స్ అధికారులు ఉగ్ర దాడులు జరిగినట్లు ప్రకటించడం కూడా జరిగింది. తర్వాత విచారణలో పైలెట్ ఆటో పైలెట్ మోడ్ ఆన్ చేసి నిద్రపోయినట్లు తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri