ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్న.. అమెరికా సహా నాటో యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థిక యుద్ధం చేస్తున్నా.. ఎంతోమంది సైనికులు చనిపోతున్నా.. ఎంతోమంది సామాన్య ప్రజలు ప్రాణాలు వదులుతున్న.. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి.  సైనిక చర్య అంటూ రష్యా మొదలుపెట్టిన యుద్ధం ఇక 100 వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులు ఎడతెరిపి లేకుండా అటు రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది.


 మరోవైపు చిన్న దేశమైన ఉక్రెయిన్ సైనికులు కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యం లోనే యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది కూడా ఎవరి ఊహకందని విధంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే రష్యా యుద్ధం మొదలు పెట్టిన యుద్ధం 100 రోజులకు చేరుకున్న నేపథ్యంలో  ఇటీవలే ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పింది. తమ సైనిక చర్య ఎప్పటిలాగానే కొనసాగుతుంది అంటూ రష్యా చెప్పడం గమనార్హం.


 సైనికచర్య ప్రారంభించే ముందు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు  నెరవేరేంతవరకు కూడా యుద్ధం ఆగే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. డొనేట్ స్కో, లోహన్ స్కో ప్రాంతాల ప్రజలను రక్షించటమే మా ప్రధాన లక్ష్యం అంటూ తెలిపిన రష్యా ఇక వారి రక్షణ కోసం ఇప్పటికీ చర్యలు తీసుకున్నాము అంటూ తెలిపింది. నాజీ అనుకూల ఉక్రెయిన్ దళాల నుంచి ఎన్నో ప్రాంతాలను విముక్తి చేశాము అంటూ ప్రకటించింది. ఈ వంద రోజుల్లో ఇప్పటి వరకు 25 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించారు. డాన్ బాస్ ప్రాంతం పై నియంత్రణ సాధించింది. నల్లసముద్రం వెంబడి కీలక నౌకాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: