సాధారణంగా న్యాయస్థానాల్లో విచారణకు ఎప్పుడూ చిత్రవిచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇలాంటి వింతైన కేసులు వచ్చినప్పుడు కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయ్ అన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. అయితే కోర్టులో విచారణ జరిగే కేసులు ఎంత విచిత్రంగా ఉంటాయో విచారణ జరిగిన తర్వాత కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా కొన్నిసార్లు అంతే వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అలాంటి తరహా ఘటన గురించి అని చెప్పాలి.


 ఒక వ్యక్తితో కలిసి మహిళా కారులో శృంగారం లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఏకంగా ఆ మహిళ 40 కోట్ల రూపాయలు పొందటం గమనార్హం. అదేంటి కారులో శృంగారం లో పాల్గొంటే 40 కోట్ల రూపాయల ఎలా వచ్చాయని అనుకుంటున్నారు కదా. దాని వెనుక పెద్ద స్టోరీ ఉంది. తన ప్రియుడితో కలిసి ఇష్టపూర్వకంగానే కారులో సెక్స్ చేసింది సదరు మహిళ. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి అప్పటికే హెచ్ పి వి  అనే లైంగిక వ్యాధి తో బాధపడుతూ వుండగా.. ఇక అతనితో శృంగారంలో పాల్గొన్న కారణంగా సదరు మహిళకు కూడా ఆ వ్యాధి సంక్రమించింది.



 అయితే కారులో శృంగారం చేయడం కారణం గానే తనకు నష్టం జరిగింది అంటూ సదరు మహిళ ఆరోపించడం గమనార్హం. ఈ క్రమం లోనే ఆ కారు బీమా సంస్థదే బాధ్యత అంటూ ఏకంగా 40 కోట్ల రూపాయలు దావా వేసింది సదరు మహిళ. ఇక ఇలాంటి కేసు వేసినప్పుడు కోర్టులో విచారణ జరిగింది అంటే కేసు కొట్టివేయడం పక్క అని అందరు నమ్ముతూ ఉంటారు. అయితే ఇటీవల యూఎస్లోని మిస్సరి కోర్టు ఈ కేసును విచారించి విచిత్రంగా సదరు మహిళకు అనుకూలం గా తీర్పు నిచ్చింది. దీంతో సదరు భీమా సంస్థ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: