పానీ పూరి.. ఈ పేరు వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరిపోతు ఉంటుంది. పానీపూరి బండి ఎక్కడో మురికి కాలువల పక్కన ఉంటుంది. అక్కడ వాడే నీరు కూడా శుభ్రమైనదా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా పానీపూరి అంటే తెగ ఇష్టపడి పోతూ ఉంటారు అని చెప్పాలి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన పానీపూరి బండి కనిపించిందంటే చాలు కాస్త సమయం కుదుర్చుకుని మరి హాయిగా పానీపూరి ఆరగించి మనస్సును తృప్తి పరచు కుంటూ ఉంటారు. ఇక అమ్మాయిలైతే పానీపూరి మరింత ఇష్టపడతారు అన్నది అందరికీ తెలిసిన విషయమే.


 దీంతో పానీపూరి అనేది నేటి రోజుల్లో ఒక బిజినెస్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయ్. పెద్ద పెద్ద రెస్టారెంట్లు సైతం తమ హోటల్లో పానీపూరి ఒక మెనూ ఐటమ్ గా పెట్టుకుంటున్నారు అని చెప్పాలి  ఇంతకీ ఇప్పుడు ఈ పానీపూరీ గురించి ఎందుకు మాట్లాడు కోవలసి వచ్చింది అనే కదా మీ డౌట్.. అందరికీ ఇష్టమైన నోరూరించే పానీ పూరీ గురించి ఇటీవలే ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. కలరా వ్యాప్తికి పానీ పూరి లో ఉపయోగించే అపరిశుభ్రమైన నీరు కారణమని చివరికి అధికారులు పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించారు.


 ఇది భారత్లో కాదు నేపాల్ రాజధాని ఖాట్మండులో. ఖాట్మండులో కలరా వ్యాధి ఎంతలా విజృంభిస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. ఇప్పటి వరకు 12 మంది కలరా బారిన పడినట్లుగా గుర్తించారు. ఇక కలరా వ్యాప్తి చెందడానికి పానీ పూరీలో ఉపయోగించే అపరిశుభ్రమైన నీరు కారణమంటూ గుర్తించారు అధికారులు. ఇక ఆ నీరు కారణంగానే బాక్టీరియా సోకుతుంది అని గుర్తించి.. పానీపూరి అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరిలో అయినా కలరా లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే వెంటనే టెస్టులు  చేయించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: