
ఇక ఇలా లైఫ్ లో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారు చాలామంది ఒంటరిగా అడవులలో ప్రయాణించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా అడవుల్లోకి వెళ్ళిన సమయంలో ఎన్నో రకాల వన్యప్రాణులు ఎదురు పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సాదాసీదా అడవి జంతువులు ఎదురుపడితే పరవాలేదు. కానీ కొన్ని కొన్ని సార్లు క్రూర మృగాలు ఎదురుపడినప్పుడు మాత్రం ఇక ఇలా పర్యటకుల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది అని చెప్పాలి. కొంతమంది అయితే ఏకంగా సైకిల్ కి టార్చ్ లైట్ వేసుకొని ఇక కొండలు పర్వతాల్లో కూడా ఎక్కువగా తిరిగేస్తూ ఉంటారు.
ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసాడు. కానీ సైకిల్‌పై రయ్ మంటూ దూసుకుపోతున్న సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. ఏకంగా పొదల్లోంచి ఒక సింహం పిల్ల బయటకు వచ్చింది. ఇక ఎంతో సేపటి వరకు అతన్ని చూసింది. అతను ఒక్కసారిగా వణికిపోయాడు. కానీ అది చిన్నపిల్ల అని తెలిసి ధైర్యంగా అక్కడే ఉన్నాడు. ఇక అంతలో మరో సింహం పిల్ల వచ్చింది. అప్పుడు కాస్త భయం వేసింది. కాసేపటి వరకు అక్కడే నిలబడిన సదరు వ్యక్తి ఇక ఆ తర్వాత సింహం పిల్లలు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకొని ముందుకు సాగాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు సదరు వ్యక్తి.