పెళ్లి అనేది నేటి రోజుల్లో ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మంచి భాగస్వామి దొరుకుతే చాలు ఇంకేం అవసరం లేదు అని అందరూ అనుకునేవారు. ఇక కట్న కానుకల గురించి కూడా పెద్దగా ఆలోచించేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం అమ్మాయి ఎలా ఉన్న పర్వాలేదు కానీ కట్నకానుకలు మాత్రం భారీగా ఉండాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఇక అమ్మాయిలు కూడా మంచి బ్యాంకు బాలన్స్ మెయింటైన్ చేస్తున్న వ్యక్తి తనకు భర్తగా వస్తే ఇక ఎలాంటి కష్టాలు ఉండవు అని కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఇటీవలే కాలంలో పెళ్లి విషయంలో యువతి యువకుల ఆలోచనలు ఇలా ఉంటే అయితే కొంతమంది సంపన్నులు మాత్రం వయసుతో పని లేకుండా పెళ్లి చేసుకుంటూ ఉండడం మాత్రమే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. ఏకంగా కృష్ణారామ అనుకుంటూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా జీవితం గడపాల్సిన వయసులో ఏకంగా పెళ్లితో మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు ఎంతోమంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.


 న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిలియనీర్ అయినా రూపర్డ్ మార్దొక్ కి ఇప్పుడు 92 ఏళ్ళు. అయితే ఇటీవల ఏకంగా ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.  తన ప్రియురాలు అయినా ఆన్ లెస్లీ స్మిత్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే గత ఏడాది ఆగస్టులో నాలుగో భార్యా జెర్రీ హాల్ కు విడాకులు ఇచ్చిన ఆయన ఇక ఏడు నెలల గ్యాప్ లోనే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా 92 ఏళ్ల వయసులో. అయితే ఇదే తన చివరి వివాహం అని ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెబుతున్నాడు రూపర్డ్ మార్దొక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri