ఎందుకంటే కొంత మందిని నెటిజెన్స్ సోషల్ మీడియా లో చిత్ర విచిత్రమైన పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా పోస్ట్ ఒకటి వైరల్ గా మారి పోయింది. యూఎస్ కు చెందిన ఒక మహిళ ఏకంగా తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని భావించింది. ఈ క్రమం లోనే సోషల్ మీడియా లో ఆమె పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం అందరిని ఆకర్షించేలా ఒక భారీ ఆఫర్ ప్రకటించింది. తనకు ఒక మంచి వరుడును వెతికి పెట్టాలి అంటూ సూచించింది సదరు మహిళ.
ఒంటరిగా ఉండి విసిగిపోయాను అంటూ యూఎస్ కు చెందిన ఈటిల్ అనే 35 ఏళ్ళ మహిళ పోస్ట్ పెట్టింది. తోడు కోసం వెరైటీ ప్రకటన చేసింది. తనకు సరైన పెళ్ళికొడుకుని వెతికితే 5,000 డాలర్లు బహుమతిగా ఇస్తాను అంటూ వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో 4.10 కోట్ల రూపాయలు అని చెప్పాలి. అయితే ఇలా పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఎక్కువ కాలం ఉండలేనని.. 20 ఏళ్లలో విడాకులు ఇచ్చేస్తాను అంటూ చెబుతుంది సదరు మహిళ. అయితే తోడు కోసం ఐదేళ్లుగా డేటింగ్ యాప్లో ప్రయత్నాలు చేసినప్పటికీఅదృష్టం కలిసి రాలేదు అంటూ చెబుతుంది. ఏది ఏమైనా ఆ మహిళ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి