అయితే భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్లో మాత్రం బంగారం ధర వింటే ఏకంగా హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర 59,100 గా ఉంది. అయితే వివిధ నగరాలను బట్టి స్వల్పంగా మారుతూ ఉంటుంది కానీ పాకిస్తాన్లో బంగారం ధర ఎంతో తెలిస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి అని చెప్పాలి. బంగారం అంటే ఇష్టపడే మహిళలు సైతం ఇక ముక్కున వేలేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారత్లో ఉన్న ధరతో పోల్చి చూస్తే ఏకంగా ఒక తులం బంగారం కొనడానికి నాలుగు రేట్లు ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి పాకిస్థాన్ లో ఏర్పడింది.
ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవయోల్బణం పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యావసరల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇక బంగారం ధర అయితే వింటేనే భయపడేలా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 2,22,900 కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,89470 రూపాయలుగా ఉంది అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఒక తులం బంగారంతో మన దేశంలో చిన్న సైజు కారు కొనవచ్చు అని చెప్పడంలోనూ ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి