
ఇక నిత్యవసరాల ధరలు కూడా సామాన్యుడి ఊహకందని రీతిలో ఆకాశాన్ని అంటుతూ ఉండడం గమనార్హం. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అంతకంతకు పెరిగి పోతున్నాయి అని చెప్పాలి. అయితే అక్కడి ప్రభుత్వం ఇలా ద్రవయోల్బణాన్ని తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం తో సామాన్య ప్రజల జీవితం మొత్తం దుర్భరం గా మారి పోయింది. అయితే ఇటీవల ఏకంగా పాకిస్తాన్లో గ్యాస్ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగి పోయింది అన్నది తెలుస్తుంది. అక్కడ గ్యాస్ సిలిండర్ ధర పెరిగి పోయిన తీరు గురించి తెలిసి ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం మొత్తం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకు ఎంతలా దిగజారి పోతున్నాయి అన్నదానికి ఇక గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల నిదర్శనం గా మారి పోయింది అని చెప్పాలి. పాకిస్తాన్ దేశానికి చెందిన గ్యాస్ కంపెనీ ఓజీ ఆర్ఏ డొమెస్టిక్ సిలిండర్ ధరను కిలోకి 246.15 చొప్పున పెంచింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర పాకిస్తాన్ కరెన్సీలో 3079.64 రూపాయలకు చేరింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అటు పాకిస్తాన్ లో విపరీతమైన ఆకలి చావులు పెరిగే అవకాశం ఉంది అని ఎంతో మంది నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.