ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఎన్నో తెగలు ఉన్నాయి. అయితే ఇక ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. నేటి ఆధునిక సమాజంలో కూడా కొంతమంది చిత్ర విచిత్రమైన సాంప్రదాయాలను ఆచారాలను పాటించడం.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఎవరైనా ఇలాంటి వింత ఆచారాలను పాటించారు అంటే చాలు అది కాస్త అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఇలాంటి వింతైన ఆచారానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఇప్పటివరకు మగవాళ్ళు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోవడం చూశాము. అయితే కొంతమంది చట్టానికి విరుద్ధంగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే.. ఇలా మగవారు ఒకటికి మించి పెళ్లి చేసుకోవడం కొన్ని ప్రాంతాలలో ఏకంగా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా కొనసాగుతూ ఉంటుంది. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా వింతైన సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు ఆయా ప్రాంతాల ప్రజలు. కానీ ఏకంగా అబ్బాయిలు కాదు అమ్మాయిలు ఎక్కువసార్లు  పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఉండే ఆచారం మాత్రం ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.


 అయితే ఇక్కడ మాత్రం ఇలాంటి ఆచారాన్నే పాటిస్తూ ఉంటారట. నేపాల్ ఖాట్మండు లోని నేవారి తెగలో వింత ఆచారం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ తెగలో పుట్టిన అమ్మాయిలకు మూడుసార్లు పెళ్లి చేస్తారు. ఐదు నుంచి 10 ఏళ్ల అమ్మాయిలకు మొదట మారేడు పండుతో, ఇక పుష్పవతి అయ్యాక వెంటనే సూర్యుడితో పెళ్ళి చేస్తారు. ఇక 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమెకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తారు. కాగా ముందు రెండు పెళ్లిలను దైవ వివాహంగా అక్కడి ప్రజలు భావిస్తూ ఉంటారట. ఇక మూడో పెళ్లిని అసలైన వివాహంగా పరిగణిస్తూ ఉంటారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: