సాధారణంగా మనం సినిమాల్లో చూసే కొన్ని సన్నివేశాలు నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ఇక ఇలాంటివి చూసినప్పుడు సినిమాలు కదా ఇలాంటివి సర్వసాధారణం అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి తరహా ఘటనలు జరుగుతాయా అని అడిగితే మాత్రం అసాధ్యమని అంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాలను తలపించే ఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.


 సాధారణంగా కొన్ని సినిమాల్లో ఇట్స్ ఏ మిరాకిల్.. వైద్య చరిత్రలో ఇలాంటిది ఇప్పటివరకు చూడలేదు అంటూ కొన్ని కొన్ని కామెడీ సన్నివేశాలలో డైలాగులు చెప్పడం చూస్తూ ఉంటాం. అయితే రియల్ లైఫ్ లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ఇట్స్ ఏ మిరాకిల్.. ఇలాంటిది ఇప్పటివరకు వైద్య చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు, వినలేదు అని ఇక ప్రతి ఒక్కరు కూడా చెప్పకుండా ఉండలేరు. సాధారణంగా ఒక వ్యక్తి కోమలోకి వెళ్ళిన తర్వాత కోమా నుంచి ఎప్పుడు బయటికి వస్తారు అన్నది అటు వైద్యులు కూడా చెప్పలేరు.


 కోమా నుంచి బయటికి రావడానికి ఇక తమ వంతుగా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంటారు వైద్యులు. అయితే ఇక్కడ ఒక మహిళా కోమా నుంచి బయటికి వచ్చింది. అది కూడా ఒక జోక్ విని. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇది నిజంగానే జరిగింది. అమ్మ చెప్పిన జోక్ విని ఓ మహిళ కోమా నుంచి బయటికి వచ్చింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్ళింది. తర్వాత మంచానికే పరిమితమైంది. అయితే 2022లో ఆమె తల్లి పెగ్గి మీన్స్ జోక్ చెప్పడంతో జెనీఫర్ శరీరంలో చలనం మొదలైంది. తర్వాత నవ్వుతూ స్పందించింది. ఇక ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మరింత మెరుగవుతుంది అని ఇటీవల  బాధితురాలు తల్లి పెగ్గి మీన్స్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: