ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వాలిపోతుంది. ఈ క్రమంలోనే ఇక ఎన్నో విషయాలు ఆసక్తికరంగా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చే కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి విషయాలను తెలుసుకొని ఆశ్చర్య పోవడం ప్రతి ఒక్కరి వంతు అవుతుంది. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన గురించిన వార్త ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. ఇకఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.


 ఇట్స్ మిరాకిల్ వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం అనే డైలాగులు ఎక్కువగా సినిమాల్లో వింటూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన గురించి తెలిసిన తర్వాత మీరు నిజంగానే ఇట్స్ మిరాకిల్ అనేస్తారు అని చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళ కేవలం 6 నెలల గ్యాప్ లోనే ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. అదేంటి ట్విన్స్ అయితే నిమిషాల వ్యవధిలో పుడతారు. కొన్ని కొన్ని సార్లు లేట్ అయినా కొన్ని గంటల వ్యవధిలోజన్మిస్తారు. కానీ ఏకంగా ఆరు నెలల గ్యాప్ లో ఇద్దరికీ ఎలా జన్మనివ్వడం కుదురుతుంది అనే అనుకుంటున్నారు కదా. ముందే చెప్పాను కదా విషయం తెలిస్తే ఇట్స్ మిరాకిల్ అని అంటారని.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. వైద్య చరిత్రలోనే ఒక అరుదైన ఘటన జరిగింది. అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఆరు నెలల్లోని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఆమె గర్భం దాల్చిన మూడు నెలలకు మరోసారి గర్భం దాల్చింది. ఇక ఒకే సమయంలో గర్భంలో వేరు వేరు వయస్సు ఉన్న పిండాలు పెరిగాయి. వైద్య పరిభాషలలో దీనిని సూపర్ పిటిషన్ అని అంటారు. అయితే ఇలా జరగకూడదు అంటే ఇక గర్భం దాల్చిన తొలి నెలలో భార్య భర్తలు శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇలా సూపర్ పిటిషన్ కారణంగా కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇద్దరికీ జన్మనిచ్చింది మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: