ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచ నలుమూలకు పాకిపోయింది. దీంతో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతోంది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని కొన్ని సార్లు వింతైన ఘటనలు వెలుగులోకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా చైనాలో ఇలాంటి వింత ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఏకంగా చైనాలో అద్దెకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ని ఇవ్వడం లాంటి ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఒక వ్యక్తితో ఎప్పటికీ రిలేషన్షిప్ పెట్టుకోకుండా.. కేవలం అవసరం వచ్చినప్పుడు మాత్రమే అద్దెకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ని కొంత మొత్తంలో చెల్లించి.. ప్రేమాయణం  కొనసాగించేందుకు చైనాలో అనుమతి ఉంటుంది. ఇక ఇలాంటి వింతైన ట్రెండు గురించి తెలిసి అందరూ అవాక్కవ్వుతూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనాలో మ్యారేజ్ విషయంలో కూడా ఇలాంటి ఒక వెరైటీ ఆలోచన చేసిందట ఒక మ్యారేజ్ ఏజెన్సీ. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఇక ఈ మ్యారేజి ఏజెన్సీ ప్లాన్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.


 చైనాలోని జండీయాంజి మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీకి ఇటీవల కాలంలో పాపులారిటీ పెరుగుతుంది  అయితే ఈ మ్యారేజ్ ఏజెన్సీ 'లీవ్ ఇన్ సన్ ఇన్ లా' అనే కాన్సెప్ట్ కి స్వీకారం చుట్టింది. దీని ప్రకారం ఇక ఒంటరి పురుషులందరూ కూడా సంపన్న మహిళలకు ఇల్లరిక అల్లుడుగా వెళ్లాల్సి ఉంటుంది. తద్వారా ఇక పెళ్లి తర్వాత మహిళలు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే మహిళలు మాత్రమే ఎందుకు పుట్టినిల్లుకు దూరం అవ్వాలి అనే ఆలోచన చేసి సదరు సంస్థ ఇక ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్ ను తెరమీదకి తీసుకువచ్చింది. అయితే ఎలాంటి పురుషులు దీనికి అప్లై చేయాలి అనే విషయంపై కూడా కొన్ని నిబంధనలు పెట్టింది సదరు మ్యారేజ్ ఏజెన్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: