రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. యూరోపియన్ యూనియన్ లో కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధమైన నేపథ్యంలో.. వద్దు అని వారించింది రష్యా. కానీ ఉక్రెయిన్ ఎంతకీ మాట వినకపోవడంతో చివరికి చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం పై యుద్ధానికి దిగింది రష్యా. ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే చిన్న దేశం అయినప్పటికీ అటు ఉక్రెయిన్ కూడా రష్యా తో ధీటుగానే యుద్ధం చేసింది. అటు అగ్రరాజ్యమైన అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ఆయుధ సహకారం ఆర్థిక సహకారం అందడంతో ఇక రష్యాను యుద్ధంలో దీటుగా ఎదుర్కోగలిగింది ఉక్రెయిన్.



 అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తుంది. అయినప్పటికీ ఎక్కడ మార్పు మాత్రం కనిపించడం లేదు అని చెప్పాలి. అయితే పలుమార్లు రెండు దేశాలు మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ.. ఫలితం మాత్రం లేకుండా పోయింది అని చెప్పాలి. పలుమార్లు అగ్రరాజ్యమైన అమెరికా సైతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని సర్దుమనిగేలా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.



 ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి కూడా తాము ఎక్కడ వెనకడుగు వేయబోము అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారగా.. ఇక పుతిన్ వ్యాఖ్యలపై ఇటీవల అమెరికా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కి మద్దతుగా పాశ్చాత్య  దేశాలు బరిలోకి దిగితే అనుయుద్ధం మొదలవుతుందని.. పుతిన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా బాధ్యత రాహితంగా ఉన్నాయి అంటూ అమెరికా వ్యాఖ్యానించింది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. న్యూక్లియర్ వెపన్స్ తో దుష్పరిణామాల గురించి గతంలో రష్యాతో ప్రైవేట్ గా ప్రత్యక్షంగా మాట్లాడాము. ఆ దేశం అణ్వాయిదాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అంటూ యూఎస్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: