మొబైల్ నెంబర్ లేదా బండి నెంబర్లను ఫాన్సీ నెంబర్ కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఇలా ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంత మొత్తంలో ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు.  ఇంకొంతమంది ఏకంగా తమ వాహనానికి ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి అని భావించి లక్షల రూపాయలు ఖర్చుపెట్టడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇలా అప్పుడప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కోసం కొంతమంది భారీగా ఖర్చుపెట్టడం గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతూ ఉంటారు.


 ఫ్యాన్సీ నెంబర్ పిచ్చి ఏమో కానీ మరి ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతో మంది ఫ్యాన్సీ నెంబర్ కోసం వెయ్యి లేదా రెండు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టడం చూస్తూ ఉంటాం. మహా అయితే లక్షల్లో ఖర్చు పెడతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలను తనకిష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం ఖర్చు పెట్టాడు. ఇది తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి.


 ఫ్యాన్సీ నెంబర్ల కోసమే ఇలా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఇక అతను ఎంత సంపన్నుడో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. ఏకంగా ఫ్యాన్సీ నెంబర్లు కోసం ఒక వేలంపాట నిర్వహించారు. అందులో 058 -7777777 ఫోన్ నెంబరు ఇక రికార్డు స్థాయిలో వేలం పాటలో ధర పలికింది. ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు ఈ ఫ్యాన్సీ నెంబర్ను కొనుగోలు చేశారు. ఈ నెంబర్కు 22 లక్షలతో వేలం ప్రారంభం కాగా దీని దక్కించుకునేందుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇక మరో నెంబరు  058-5555555 కూడా ఏకంగా ఈ వేళలో 6.5 కోట్ల రూపాయల ధర పలకడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: