నేటి రోజుల్లో ఇంటర్నెట్ అనేది ప్రపంచమంతా పాకిపోయింది. దీంతో ఇంటర్నెట్ పాకిన ప్రతి చోటికి సోషల్ మీడియా కూడా విస్తరించి పోయింది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా నేటి రోజుల్లో సోషల్ మీడియాలో మునిగితేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కూర్చున్న చోటు నుంచే ప్రపంచ నలమూలల్లో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటే అని చెప్పాలి.


 రియల్ లైఫ్ లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని అనిపించే విధంగా కొన్ని ఘటనలు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు ఆ కుటుంబం ఎంత కంగారు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఆచూకీ కోసం ముందుగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో వెతుకుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఫలితం లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తూ ఉంటారు. పోలీసులు కూడా కొన్ని కొన్ని సార్లు వెతికి తప్పిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకొస్తే ఇంకొన్నిసార్లు మాత్రం పోలీసులకు కూడా వ్యక్తి ఆచూకీని కనుగొనడం అసాధ్యంగా మారుతూ ఉంటుంది.


 ఇక్కడ ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. అది కూడా 1998లో. ఇన్నేళ్ల తర్వాత అతను ఎక్కడ ఉన్నాడో తెలిసింది. ఇంతకీ ఎక్కడ ఉన్నాడో తెలుసా పక్కింట్లోనే. విచిత్రంగా ఉంది కదా అల్జీరియాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హోమర్ బి అనే 45 ఏళ్ల వ్యక్తి 1998లో తప్పిపోయి 26 ఏళ్ల తర్వాత పక్కింట్లో ప్రత్యక్షమయ్యాడు. 1998లో ఆర్జీరియన్ అంతర్ యుద్ధంలో ఓమర్ ని ఎవరో కిడ్నాప్ చేసి హతమార్చారని కుటుంబ భావించింది. అయితే అతడిని ఇన్నాళ్లు పక్కింటి వ్యక్తి బంధించినట్లు తెలిసింది. విదేశాలకు పారిపోవాలని చూసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.. బందీగా ఉండడంతో తాను ఎవరి సహాయం పొందలేకపోయాను అంటూ ఇలా తప్పిపోయిన ఓమర్ చెప్పడం గమనార్హం.  అయితే బంధించడానికి కారణాలు ఏంటి అన్న విషయం మాత్రం చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: