ఇప్పటికే ఆధార్ కార్డు పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమపథకాలు అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. దీంతో జనం ఆధార్ కార్డు కోసం ఎగబడుతున్నారు. గ్యాస్, బ్యాంక్, రేషన్ ఇలా అన్ని ఇకనుంచి ఆధార్ కార్డు ఉన్నవారికే అంటూ కేంద్రం మెలిక పెట్టింది. తాజాగా ఆ జాబితాలో శాశ్వతఖాతా సంఖ్య(పాన్ కార్డు)ను కూడా చేర్చింది. పాన్‌కార్డు కోసం చూపించాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుందంటున్నారు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు. ఈ మేరకు పాన్ కార్డుకు చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డుల్లో ఆధార్‌ను కూడా చేర్చాలని యూఐడీఏఐ కొద్దిరోజుల క్రితం ఆర్థికశాఖకు లేఖ రాశారు. ఆర్థికశాఖ అధికారులు కూడా దీనికి అంగీకరించారు. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని పన్ను చెల్లింపుదారులకు అవినీతికి అలవాటుపడిన ఐటీ అధికారుల నుంచి అందుతున్న దొంగ పాన్‌కార్డులను అరికట్టేందుకు ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆధార్‌ కార్డుకు గుర్తింపు కార్డుల జాబితాలో స్థానం లభిస్తే చాలా వరకూ ఫోర్జరీ, డూప్లికేషన్‌ చేయబడ్డ పాన్‌ కార్డులకు కాలం చెల్లినట్టేననంటున్నారు.  ఇప్పటివరకూ పాన్‌ కార్డు కోసం వోటర్‌ ఐడి, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, స్థిరాస్తి యాజమాన్య ధృవీకరణను అంగీకరిస్తున్నారు. త్వరలో కేంద్రం అధికారికంగా వెల్లడించనున్న నిర్ణయంతో ఆధార్ కార్డు కూడా పాన్ కార్డుకు గుర్తింపుగా ఉపయోగపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: