ఓ ఆటలోగానీ, పోటీలోగానీ విజయం అనంతరం తమకు నచ్చిన ప్రేయసికి, ప్రియుడికి ప్రపోజ్‌ చేసే సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అప్పటి వరకు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయినా తాను విజయం సాధించినచోట మనుసులో ఉన్న వ్యక్తి అక్కడే ఉండి ఉంటే మాత్రం ప్రేమ తన్నుకొని రావడం మాత్రం ఖాయం. తాజాగా ఓ దిగ్గజ రెజ్లర్‌ రింగులో ప్రత్యర్థిని మట్టికరిపించి సంతోషంలో అభిమానుల మధ్య ప్రేయసి ఎదుట పెళ్లి ప్రతిపాదన ఉంచాడు.



ప్రతిపాదనకు ఆమె ఒప్పుకోవడంతో ఆ జంట ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) ఫ్లొరిడాలోని ఓర్లాండోలో డబ్ల్యూడబ్ల్యూఈ 33వ రెస్లేమేనియా నిర్వహించారు. దీనిలో భాగంగా అమెరికన్‌ ప్రొఫెషనల్‌ రెజ్లర్లు జాన్‌సెనా- నిక్కీ బెల్లాతమ ప్రత్యర్థులు మిజ్‌(అమెరికా)- మార్సి(కెనడా)ని మట్టి కరిపించారు. ఈ విజయం సాధించిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా వెంటనే ఆకాశంవైపు ఓసారి చూసి మోకాలిపై కూర్చుని తనతోపాటు రెజ్లింగ్ రింగ్‌లో ఉన్న నిక్కీవైపు చూస్తూ ఓ వజ్రపు ఉంగరాన్ని తనకిస్తూ ప్రపోజ్‌ చేశాడు. 



ఈ క్షణం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని.. ఇక చెప్పకుండా ఉండలేనని జాన్‌ అన్నాడు. ఈ సన్నివేశాన్ని వూహించని నిక్కీ ఒకింత భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత వెంటనే జాన్‌ ప్రతిపాదనను ఒప్పుకొంది. వెంటనే జాన్‌ వజ్రపు ఉంగరాన్ని నిక్కీకి బహుమతిగా ఇచ్చాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు ఆశ్యర్యానికి గురయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: