జమ్మూకాశ్మీర్‌లో ఏం జరుగుతుందో అన్న భయంతో ఒక ప్రక్క పర్యాటకులు, మరో పక్కా స్థానికిలు భయందోళన చెందుతున్నారు. రాష్ర్టంలో ఉగ్రపంజా ఉందనే ఉద్దేశ్యంతోనే పర్యాటకులను కూడా వెనక్కి పంపుతున్నారు. కాశ్మీర్ అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అమర్ నాధ్ యాత్ర కోసం కొన్ని నెలల ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చిన వారు కూడా చివరకు దర్శనం కాకపోవడంతో ఆందోళనతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా పాఠశాలలను, కళాశాలల విద్యార్ధులను కూడా తమ స్వస్థలాలకు పంపిచారు.

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. లేదా కాశ్మీర్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించడం అనే ఎత్తుగడతో కేంద్రం ముందుకు కదులుతోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం లేదా మంగళవారం కేంద్రం చర్యలపై కొంతలో కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేయడం అంటే కాశ్మీర్ పై దురాక్రమణకు తెగించినట్లేనని జమ్మూకాశ్మీర్ అఖిల పక్ష నేతలు హెచ్చరించారు. అంతే కాదు జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ల ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్రతిపత్తిని, గుర్తింపును కాపాడుకుంటామని పేర్కొన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో భేటీ అయిన అనంతరం అఖిల పక్షం నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలతో సమావేశమవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేస్తే అది జమ్మూ, కాశ్మీర్, లడఖ్ ప్రజలపై రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్లినట్లేనని ప్రకటించారు. ఉద్రిక్తతలను పెంచే దిశగా చర్యలు తీసుకోవద్దని భారత దేశానికి, పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, పీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

కాశ్మీర్ లో మునుపెన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర భవితవ్యంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌ లోయలో అడుగడుగునా భద్రతా బలాలను మోహరించారు. కాశ్మీర్‌ ప్రముఖ రాజకీయ నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సజద్‌లను ఆదివారం రాత్రి నుంచి గృహ నిర్బంధం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బహిరంగ సమావేశాలు,గుంపులుగా తిరగడాలను నిషేధించారు. శ్రీనగర్ జిల్లాలో సెక్షన్ 144 అమలుచేశారు.సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో కాశ్మీర్ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: