అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయా దేశాల నేత‌లు త‌మ‌దైన శైలిలో చర్చించుకునే సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ దేశానికి చెందిన ప్ర‌ముఖులు అయితే..మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డెన్మార్క్‌కు చెందిన స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన గ్రీన్‌ల్యాండ్ దీవిని అమెరికా కొనుగోలు చేయబోతున్నదన్న వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ దీవిని కొనుగోలు చేసే ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారులతో రహస్యంగా చర్చించినట్లు వార్తలు వెలువడ్డాయి. వచ్చే సెప్టెంబర్‌లో ట్రంప్ డెన్మార్క్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ ప్రధానులతో ఈ అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉందనేది ఆ వార్త‌ల సారాంశం. అయితే, ట్రంప్ చ‌ర్చ‌ల‌ను డెన్మార్క్ రాజకీయనేతలు కొట్టివేశారు.

 

 

భూతలంపై అంటార్కిటికా తర్వాత… దాదాపు 85 శాతం మంచుతో కప్పివున్న ప్రాంతం గ్రీన్ లాండ్. మొత్తం 20 లక్షల మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇక్కడ ప్రస్తుతం 57 వేల మంది జీవిస్తున్నారు. వాళ్లలో ఎక్కువ మంది సంచార జాతులకు చెందినవాళ్లే. ఐతే… ప్రపంచంలోని 10 శాతం స్వచ్ఛమైన నీరు గ్రీన్‌లాండ్‌ లో మంచు రూపంలో ఉంది.ట్రంప్ నిర్ణయంపై వైట్‌ హౌస్‌ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. డెన్మార్క్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై సైలెంట్‌గా ఉంది. ట్రంప్ సలహాదార్లు మాత్రం… గ్రీన్‌ల్యాండ్‌ ను అమెరికా దక్కించుకుంటే… అది అమెరికా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు. అది ట్రంప్ సొంత నిర్ణయంగా చెబుతున్నారు. గ్రీన్ లాండ్‌ ను దక్కించుకుంటే… అక్కడ భారీ ఎత్తున మిలిటరీ బలగాల్ని మోహరించేందుకు అమెరికాకు వీలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐతే… గ్రీన్‌లాండ్ పై ఇప్పటికే అమెరికాకు చెందిన థులే ఎయిర్ బేస్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. 

 

 

 

 ``ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ అయ్యుంటుంది. అయితే పూర్తిగా అవుట్ ఆఫ్ సీజన్`` అని మాజీ ప్రధాని లార్స్ లొక్కే రాస్ముస్సెన్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ``ట్రంప్ దీనిపై నిజంగా ఆలోచిస్తుంటే, ఆయనకు పిచ్చిపట్టిందనేందుకు ఇదే చివరి ఆధారం`` అని డానిష్ పీపుల్స్ పార్టీ అధికార ప్రతినిధి సొరెన్ ఎస్పర్‌సెన్ వ్యాఖ్యానించారు. 50వేల మంది పౌరులను అమెరికాకు డెన్మార్క్ అమ్మేస్తుందన్న వార్త హాస్యాస్పదమన్నారు.

 

ఇదిలాఉండ‌గా,  ప్రస్తుతం గ్రీన్‌లాండ్‌పై మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి… ప్రపంచంలోని చాలా తీర ప్రాంత నగరాలు మునుగుతున్నాయి. ఆ పరిస్థితి మన దేశంలోని ముంబైలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.  2017లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచీ అమెరికా తప్పుకుంది. అందువల్ల భూతాపాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల నుంచీ అమెరికా తప్పించుకున్నట్లైంది. ఐతే, సెప్టెంబర్‌లో కోపెన్‌ హగెన్‌ లో జరిగే వాతావరణ సదస్సుకి ఆమెరికా హాజరవుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: