2004 డిసెంబర్ 26 ఈ తేదీని ఎవరు ఎప్పటికి మర్చిపోరు.  ఎక్కడో ఇండోనేషియాలోని బందా అసహా అనే ప్రాంతంలో హిందూమహాసముద్రంలో భూకంపం వచ్చింది.  దాని ప్రభావం 9 దేశాలపై పడింది.  సముద్రం ఉన్నట్టుండి పొంగి పొర్లింది.  ఈ సునామి దాటికి అప్పటికో 2, 27,898 మృత్యువాత పడ్డారు.  లక్షల కోట్ల రూపాయల ఆస్తినష్టం వచ్చింది.  ఈ సునామి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.  సముద్రంలో భూకంపం రావడం వలనే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. 


సముద్రంపై ఒత్తిడి పెరగడం వలన ఇలాంటి భూకంపాలు వస్తుంటాయి.  అంతేకాదు, సముద్రంలో ఉండే అగ్నిపర్వతాలు సైతం పేలినపుడు కూడా ఇలా సునామీలు వస్తుంటాయి.  2004 డిసెంబర్ 26 వ తేదీన వచ్చిన సునామి తరువాత మరలా ఆ స్థాయిలో రాలేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మరో సునామి భయపెడుతున్నది.   అదే ఇండోనేషియా దేశంలోని టర్నెట్ పట్టణానికి సమీపంలో ఉన్న హిందూ మహాసముద్రంలో భూకంపం వచ్చింది.  


ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.1 గా  నమోదైంది.  దీంతో ఇండోనేషియాలో సునామి హెచ్చరికలు జారీ చేశారు.  ఈ సునామి హెచ్కారికల కారణముగా తీరప్రాంతంలో ఉన్న వ్యక్తులను హుటాహుటిన అక్కడి నుంచి ఖాళీ చేయించారు.  సునామి హెచ్చరికల నేపథ్యంలో హిందూ సముద్రం పరిధిలో ఉన్న అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి.  


2004 లో వచ్చినట్టుగా వస్తుందేమో అని భయపడుతున్నారు.  ఈ హెచ్చరికల నేపధ్యముల్ సముద్రంలోకి మత్యకారులను అనుమతించడం లేదు. 2004 డిసెంబర్ 26 వ తేదీన వచ్చిన సునామి వలన తమిళనాడులోని నాగపట్నం దెబ్బతిన్నది.  శ్రీలంక చాలా డ్యామేజ్ అయ్యింది.  ఇక జపాన్ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.  దారుణంగా మారిపోయింది.  అసలే జపాన్ దీవుల్లో భూకంపాలు జాస్తి.  ఈ సునామితో మరింత దారుణంగా మారిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: