ప్రస్తుతం నెలకొన్న కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో బయటకు రావాలంటేనే భయమేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయక ప్రజలు అసువులు బాసారు. అల్లాగే కోట్లమంది  ఈ వ్యాధిబారినపడ్డారు.  అయితే గత ఎనిమిది నెలలుగా ప్రపంచమంతా కరోనా వ్యాధి పై మానవజాతి అంతా యుద్ధంచేస్తోందని చెప్పాలి. వైద్య శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం రోకు రోజుకి రకరకాల వార్తలు కరోనా వైరస్ తీవ్రత గురించి ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా పెళ్లికాని యువకులకు ఈ వ్యాధి ప్రభావం ఏక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి కారణాలేంటో అసలు విషయం ఏమిటో మన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

స్వీడన్లోని స్టాక్హోమ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్వెన్ డ్రెఫాల్ అనే శాస్త్రవేత్త తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం కరోనా ఒంటరి పురుషులకు చాలా ప్రమాదకరమని తెలిపింది. దీనిపై వారు 20ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషుల మరణాలపై స్వీడిష్ నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అధ్యయనం చేసింది. పెళ్లికాని పురుషులు మరియు మహిళలు (వివాహం చేసుకోనివారు వితంతువులు / వితంతువులు మరియు విడాకులు తీసుకున్నవారితో సహా) కోవిడ్ -19 నుండి మరణించినవారికి 1.5-2 రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పురుషులు ఎక్కువ మరణాలను కలిగి ఉన్నారు. "తక్కువ విద్య లేదా తక్కువ ఆదాయం ఉన్నవారికి అధిక మరణాలు ఉన్నాయని తేలింది.

ఈనేపధ్యంలో నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం .. స్వీడన్లో జన్మించిన వారి కంటే ఇతర దేశాలలో జన్మించినవారికి తక్కువ మరణాలు నమోదయ్యాయని డ్రెఫాల్ వివరించారు. ఆదాయం పడిపోవడం... ఒంటరిగా ఉండటం తక్కువ ఆదాయం.. తక్కువ స్థాయి విద్యను కలిగి ఉండే వారు కోవిడ్ -19 నుంచి చనిపోయే ప్రమాదం ఉందని అధ్యయనం చూపిస్తుంది. మహిళల కంటే పురుషులు కోవిడ్ -19 నుండి చనిపోయే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు.

ఆర్థిక వ్యవస్థలతో సహా జీవనశైలి కారకాల వల్ల ఇలా జరగవచ్చు" అని అధ్యయన రచయిత గున్నార్ అండర్సన్ తెలిపారు. ఒంటరి మరియు అవివాహితులకు వివిధ వ్యాధుల నుండి మరణాలు ఎక్కువగా ఉన్నాయని మునుపటి అనేక అధ్యయనాలు చూపించాయి ఇప్పుడు తాజా పరిశోధన కూడా అదే స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఉండడం చాలా ముఖ్యం.  

మరింత సమాచారం తెలుసుకోండి: