తాను అనుకున్న పని ఏదైనా, అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కొన్ని వ్యవహారాలు మాత్రం కేంద్రం చేతిలో ఉండటంతో,  పదేపదే వారిని అభ్యర్థిస్తూ, ఏపీకి కావాల్సిన అన్ని పనులను చక్కబెట్టుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా కొన్ని కొన్ని విషయాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి జగన్ కు సైతం మింగుడు పడడం లేదు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో  కేంద్రాన్ని అభ్యర్థిస్తూ వస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తో పాటు, విభజన హామీలు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటి య గురించి జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతి సారి కేంద్రాన్ని అభ్యర్థిస్తూ వస్తున్నారు
 ఇక ఈ వ్యవహారాన్ని పక్కనపెడితే , విభజన హామీల ప్రకారం ,అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగాల్సి ఉ న్నా కేంద్రం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు . 



ఏపీ, పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర, తెలంగాణ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉంది. 2019 ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పెంపు జరగాల్సి ఉన్నా, కేంద్రం ముందుకు రాలేదు.  ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు .అయినా, ఫలితం కనిపించలేదు. ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలనే ఉద్దేశం లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి మరో యాభై నియోజకవర్గాలు పెంచాలనే ప్రతిపాదన ఉంది .

అంటే మొత్తం ఏపీలో 225 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాల్సి ఉంది అదే జరిగితే సీట్ల సర్దుబాటు వ్యవహారం అన్ని పార్టీలకు మరింత సులువు అవుతుంది. కానీ ఈ ప్రతిపాదనను ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని ఒప్పించి నియోజక వర్గాల పెంపుకు కృషి చేస్తారో లేక చంద్రబాబు మాదిరిగా సైలెంట్ గా ఉంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: