ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న విగ్రహదాడుల చుట్టూ రాజకీయ వేడి పెరుగుతుంది. రామతీర్థం లో జరిగిన రాముడి విగ్రహ ధ్వంసం పై అన్నీ రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ రామతీర్థంలో పర్యటనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎం‌ఎల్‌ఏ నందమూరి బాలకృష్ణ స్పంధించారు. బుధవారం హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..  హిందూ ఆలయాలపై  దుండగులు ఉద్యేశ పూర్వకంగానే దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

 దేవుడి విగ్రహాలపై ఇలా కక్ష్య పూరిత రాజకీయాలు చెయ్యడం  చాలా కిరాతకమని ఆయన మండి పడ్డారు.  ఈ ఘటనను పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని దాదాపుగా 127 గుళ్లపై అనేక రకాల దాడులు జరిగాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో రథంపై మూడు వెండి సింహాలు దొగిలించినప్పుడు, దానిపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నాడు. అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని మండిపడ్డారు. అయిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, అయితే అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ద్వజమెత్తారు. మరి ఇలా అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. ఒకసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో యువత, రైతులు, కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. వినాశకాలే విపరీత బుద్ధి అని, వైసీపీ పభుత్వం పతనం అయ్యే రోజులు దగర్లోనే ఉన్నాయని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: