బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్
ఎంపీ ధర్మపురి
అరవింద్ లపై టిఆర్ఎస్ ఎమ్ఎల్సి పురాణం
సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ కార్యకర్తలు సహనంతో ఉంటున్నారని . .అలా ఉంటున్నారు కాబట్టే రోడ్లపై తిరుగుతున్నారని అదే సహనం కోల్పోయే పరిస్థితి సృష్టిస్తే
బీజేపీ నేతలను తరిమి తరిమి కొడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పై మండి పడుతూ చిల్లర గాడికి
ఎంపీ పదవి వస్తే ఎలా ఉంటుందో సంజయ్ నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన నిధులపై బండి సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు . అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కు అయ్యింది 65వేల కోట్లని. .మరి లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెడుతున్నాయని అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. నిజామాబాద్
ఎంపీ ధర్మపురి అరవింద్ పై కూడా పురాణం నిప్పులు చెరిగారు. నీ
తండ్రి పట్టుకుని వేలాడుతున్న
రాజ్యసభ సీటు
కేసీఆర్ పెట్టిన భిక్ష అని...అది గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇక
తెలంగాణ లో దుబ్బాక ఉప ఎన్నిక విజయం తరవాత బీజేపి నేతలు స్పీడ్ పెంచారు . దుబ్బాక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో
కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో
బీజేపీ నేతలు వర్సెస్ టిఆర్ఎస్ నేతలు అన్నట్టుగా మారిపోయింది . దాంతో
బీజేపీ నేతలు టిఆర్ఎస్ ప్రభుత్వం పై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక టిఆర్ఎస్ నుండి కూడా పలువురు నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా
బీజేపీ నేతల విమర్శలను ఎక్కువగా తిప్పికొట్టేవాళ్ళలో ప్రభుత్వ విప్
బాల్క సుమన్ ఉంటారు .