ముందస్తు సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరిగిన ఈ కార్యక్రమంలో బాబు మెరిశారు. అక్కడి వాళ్లందరితో కలిసి పండగ సంబరాల్లో పాలు పంచుకొన్నాడు. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. బాబులో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని యాంగిల్ ఇది. కొంచెం సీరియస్ గా కనిపిస్తూ అరుదుగా నవ్వేసే చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాల్లో మాత్రం చాలా హంగామానే చేశాడు. మహిళలతో చెయ్యి కలిపి డాన్స్ వేశాడు. డప్పు కొడుతూ దరువేశాడు... ఇంకా తనలోని భిన్నమైన కలలను ఆవిష్కరించాడు. అయితే బాబులో ఇలాంటి యాంగిల్ ఉందని ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడూ దీన్ని ప్రదర్శించలేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త ఇమేజ్ ను కోరుకొంటున్నాడు.. సీరియస్ గా ఉండటానికి భిన్నంగా జనాల్లో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పండగంటే చాలు జనాల్లో కలిసిపోతున్నాడు.బతుకమ్మ సంబరాల్లో భాగమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో బాబు కూడా ఇలాంటి ఇమేజ్ ను కోరుకొంటున్నట్టుగా ఉన్నాడు. తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేస్తున్నాడు. మరి ఈ యాంగిల్ జనాలను ఏ మేరకు ఆకట్టుకొంటుందో ముందు ముందు చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: