కారు రోడ్లపైన నడుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ, ఒక వేళ కారు గాలిలో నడిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా.. సాధ్యమేనట.. గాలిలో నడిచేలా కారును రూపొందిస్తున్నారు అమెరికా వారు. ఒకసారి ఈ పరిశోధన సక్సెస్ అయితే ఇక ఏంచక్క గాలిలో ఎగురుతూ కారులో ప్రయాణించొచ్చు. ఇకపోతే ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఉండబోవు. డైరెక్ట్‌గా మనం కావాల్సిన డెస్టినేషన్‌కు వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే రీచ్ అవుతాం.

 అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ వారు ఈ మేరకు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధకులు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని తయారు చేసి పరీక్షిస్తున్నారు. ఈ కారు 90 డిగ్రీస్ వద్ద ల్యాండ్ అవడంతో పాటు టేకాఫ్ కూడా అవుతుంది. ఎకాఎకిన గాలిలోని ఫ్లై కూడా అవగలదు ఈ ట్యాక్సీ. అదే క్రమంలో నిటారుగానే ల్యాండ్ కూడా అవుతుంది. దీనిని జోబి ఏవియేషన్ సంస్థ అభివృద్ధి చేయగా,  దీనికి ‘ఈవీటీఓఎల్’ అని పేరు పెట్టారు. ప్రజెంట్ ఈ ట్యాక్సీ ట్రయల్ రన్‌లో ఉండగా, 2024 నాటికి పూర్తిస్థాయిలో అవెయిలబులిటీలోకి వచ్చే చాన్స్ ఉంది. ప్యాసింజర్స్ ఈ ట్యాక్సీ ద్వారా వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు.

 ఈ ఎయిర్ ట్యాక్సీని ఈ నెల 1 నుంచి పది రోజుల పాటు శాంపిల్ ట్రయల్ రన్ చేస్తుండగా, ఈ నెల పదో తేదీన ఫైనల్ ట్రయల్ రన్ చేస్తారు. ‘నాసా’ కాలిఫోర్నియా క్యాంపస్‌లో‘ఈవీటీఓఎల్’ ఎయిర్ ట్యాక్సీని  పరీక్షిస్తోంది. కంప్లీట్ టెస్టింగ్ తర్వాత ఈ ఎయిర్ ట్యాక్సీ వర్కింగ్ పూర్తిగా తెలుస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ పరిశోధకులు ఈ ఎయిర్ ట్యాక్సీ కంప్లీట్ వర్కింగ్ పైన పరిశోధన చేయనున్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా సమీప సిటీలకు ప్రయాణించడం ఈజీ అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన సక్సెస్ అయితే, విమానయాన పరిశ్రమలో మార్పులొస్తాయని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: