నకిలీ బాబాల వ్యవహారం మనం రోజు ఏదోక సందర్భంలో వినడమో చూడటమో చేస్తూ ఉంటాం. ఏదోక లబ్ది చేస్తామని చెప్తూ డబ్బులు వసూలు చేసి మోసం చేస్తూ ఉంటారు. దీనిపై తీవ్ర విమర్శలు ఉన్నా సరే ప్రజల్లో మార్పు రాదూ. దొంగ బాబాలు ఏదో మాయ మాట చెప్పడం వాటిని నమ్మడం జరుగుతుంది. పిల్లలు పుడతారని, డబ్బులు వస్తాయని, వ్యాపారంలో లాభాలు ఉంటాయని ఏదోక విషయంలో మోసాలు చేస్తూనే ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా ఆ పిచ్చి మాటలు నమ్ముతూ ఉంటారు.  

ఉన్నత విద్యను అభ్యసించే వారు ఈ సొల్లు మాటలు నమ్మేసి నిండా మునిగిపోతు ఉంటారు. ఏదో అనారోగ్య సమస్యతో పిల్లలు పుట్టకపోవడానికి కూడా మా దగ్గర మంత్రాలు ఉన్నాయని చెప్పి నిండా మోసం చేస్తూ ఉంటారు. ఈ ఘటనలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. తాజాగా ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వజిత్ జా నకిలీ బాబా మోసం హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. కాలభైరవ పూజ తో ఎంబీబిఎస్ పాస్ చేయిస్తానని మోసంకు పాల్పడ్డాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న యువతి... ఆ మాయ మాటలు నమ్మింది.

ఎంబీబీఎస్ ను తన పూజలు చేయడం ద్వారా పాస్ చేయిస్తా అంటూ చెప్పడంతో ఆమె నమ్మేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎక్సమినేషన్ పాస్ చేయిస్తానని చెప్పడంతో నమ్మింది. తన దగ్గర విశేష శక్తులు ఉన్నాయని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా 80 వేల నగదును అకౌంట్లో జమ చేయించుకున్న మోసగాడు బాబా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాబాను సంప్రదించేందుకు అనేక మార్లు ఫోన్ చేసినా సరే బాబా మాత్రం స్పందించలేదు. దీంతో మోసమోయనని తెలుసుకోని యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు... బాబాబు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: