పొలిటికల్ సైన్స్ కు సినిమా సైన్స్ కు మధ్య చాలా తేడా ఉంది అని అంటారు. కానీ సినిమా సైన్స్ ను పొలిటికల్ సైన్సుకు కలిపితే  ప్రస్థానం అనే సినిమా వచ్చింది. అంతకుకమునుపు అంతఃపురం అనే సినిమా వచ్చింది. దేవాకట్టాలో అప్పుడప్పుడూ కృష్ణ వంశీ కనిపిస్తాడు. కొన్ని సార్లు నాయకన్ తీసిన మణి సర్ కనిపిస్తాడు. కొన్నిసార్లు ఆర్జీవీ కూడా అక్కడక్కడ కనిపించి వెళ్తాడు. పోలిక అని కాదు సర్కార్  రేంజ్ లో ఈస్తటిక్స్  ఉన్న  సినిమా. ప్రస్తుత వ్యవస్థపై తిరుగుబాటు ఈ సినిమా. ఇందులో వినిపించే సెటైర్లు, కామెంట్లు ఎవరిపైనా?


చాలా రోజులకు సామాజిక స్పృహ మెండుగా ఉన్న సినిమా. మంచి డైలాగులు విన్న సినిమా  ఇది కానుంది. కాబోతుంది. అవు ను! రిపబ్లిక్ సినిమా మంచి సినిమా కానుంది అనేందుకు మంచి సంభాషణలే తార్కాణం. దేవా కట్టా ప్రస్థానం తరువాత చాలా మనసు ఉంచి చేసిన సినిమా ఇది అని ఎప్పుడో చెప్పారు. అవును! డైలాగులే కాదు ఆలోచింపజేసే సన్నివేశాలూ ట్రైలర్ నిండా ఉన్నాయి. ట్రైలర్ చూసి చిరు పొంగిపోయాడు. అవును ఆయనే రిలీజు చేసి అల్లుడు తేజూకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. రమ్యకృష్ణ గారిచేత మంచి డైలాగులు చెప్పించారు. అజ్ఞానం గూడు కట్టిన చోట మోసం గుడ్లు పెడుతుంది..అని చెప్పించారు.  




కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ చెప్పిన డైలాగులు ఇంకా బాగున్నాయి. చాలా రోజులకు పవన్ చేయాల్సిన సినిమా ఒకటి ఆయన అల్లుడు తేజూ చేశాడు అని కూడా అభిమా నులు అనుకునేందుకు ఆస్కారం ఉన్న సినిమా. అక్కడ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ కు ఎంత పేరు వచ్చిందో ఇక్కడ ఈ సినిమాలో రమ్యకృష్ణకూ అంతే పేరు వస్తుం ది. అక్కడ శర్వా జీవం పోశాడు. ఇక్కడ సాయి ప్రాణం పెట్టాడు. అంత బాగా సినిమా వచ్చిందన్న కాన్ఫిడెంట్ మోడ్ లో ఉన్నాడు దేవా కట్టా. ఆల్ ద బెస్ట్ తేజూ.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap