వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇప్పుడు క్రమంగా వీడుతోంది. ఇదిగో ఇలా వివేకానందరెడ్డిని హత్య చేశామని నిందితుడు దస్తగిరి అంగీకరించినట్టు ఓ వాంగ్మూలం బయటకు వచ్చింది. దస్తగిరి సెక్షన్‌ 164 స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి ఈ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు వివేకాను ఎందుకు హత్య చేశారు.. ఎవరెవరు ఈ హత్యాకాండలో పాల్గొన్నారు.. దీని వెనుక ఎవరున్నారు అనేక అంశాలు ఈ వాంగ్మూలంలో ఉన్నట్టు తెలుస్తోంది.


వివిధ మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ప్రకారం.. దస్తగిరి వాంగ్మూలం ఇలా ఉంది.. “ 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎర్రగంగిరెడ్డి మోసం వల్లే ఓడిపోయామని వివేకా భావించే వారు. బెంగళూరు స్థలం గురించి పంచాయితీకి వివేకా అనేక సార్లు వెళ్లేవారు.. ఆ స్థలంలో ఎర్ రగంగిరెడ్డి వాటా అడిగితే వివేకానందరెడ్డికి కోపం వచ్చింది. నేను 2018లో వివేకా వద్ద పని మానేశాను.. మానేసిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌ను కలిసేవాడిని.. అని దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.  


దస్తగిరి ఇంకా ఏమని వాంగ్మూలంలో చెప్పాడంటే.. “ 2019 ఫిబ్రవరి 2న ఎర్రగంగిరెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడు.. సునీల్‌యాదవ్‌ను, ఉమాశంకర్ రెడ్డిని, నన్ను తీసుకెళ్లాడు.. వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడు.. వివేకాను నేను హత్య చేయలేనని ఎర్రగంగిరెడ్డికి చెప్పా.. అయితే..
వివేకాను హత్య చేసేందుకు తామూ వస్తామన్నారు.. వివేకాను హత్య చేస్తే.. శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు.. అందులో రూ.5 కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడని దస్తగిరి వాగ్మూలంలో తెలిపాడు.


ఇది జరిగిన 4 రోజులకు సునీల్‌ యాదవ్ నాకు రూ.కోటి రూపాయలు ఇచ్చాడు.. 25 లక్షలు తనకివ్వాలని తర్వాత ఇస్తానని సునీల్ చెప్పాడు.. రూ.75 లక్షలు మున్నా అనే వ్యక్తి వద్ద దాచి ఉంచాయ..  మార్చి 14న ఎర్రగంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, నేను వివేకా ఇంటికెళ్లాం.. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్రగంగిరెడ్డి వాటా అడిగాడు.. వాగ్వాదం జరిగి సునీల్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు.. కిందపడిన వివేకాపై ఉమాశంకర్‌రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు.. స్నానాలగదిలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశారు.. వివేకాను హత్య చేశాక అందరూ గోడ దూకి పారిపోయాం అని దస్తగిరి వాంగ్మూలంలో తెలిపినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: