నేరాలకు అడ్డాలుగా కొన్ని ప్రాంతాలు మారిపోతున్నప్పటికీ వాటి జోలికి వెళ్లడం లేదు ఆయా దేశాలు. ఎందుకంటే అవన్నీ ఏర్పాటవుతున్న ప్రాంతాలు అయితే చాలా సున్నితంగా ఉంటాయి. ఉదాహరణకు మతపరమైన విషయాలు కావచ్చు, కొన్ని మతాలవారు అక్కడ జీవిస్తూ ఉండొచ్చు. అలాంటి చోట ఒకరిని పట్టుకొని నేరస్తుడు అంటే, వెంటనే అక్కడ మతపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి సృష్టించైనా నేరస్తులు తమను తాము రక్షించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. అందుకే అనేకచోట్ల నేరాలు అడ్డాలుగా మారిపోతున్నాయి. ఇలాంటివి సినిమాలలో కూడా చూపించడం ద్వారా ప్రజలలో కొంత అవగాహనా కల్పించే ప్రయత్నం ఆ వ్యవస్థ చేసింది. నేర సామ్రాజ్యాలుగా అవన్నీ తయారవుతూ మెల్లిగా మాఫియాలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. ప్రతి నేరానికి అక్కడ మూలం ఉంటోంది. ఇవన్నీ తెలిసినా ఆయా దేశాల ప్రభుత్వాలు ఏమి చేయలేని స్థితి.

అలాంటి ప్రదేశాలు పేదదేశం, లేదా ధనిక దేశం అని కాదు, ప్రతి దేశంలోనూ మాఫియా ఏర్పాటు చేసుకోగలిగింది. దీనిపై ఆయా దేశాల రక్షణ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని చూసినా, రాజకీయ నేతల అండ కాపాడుతూనే ఉంది. కొందరు వీళ్ళను కూడా లెక్కచేయకుండా తమ బాధ్యత నెరవేర్చిన వారు కూడా లేకపోలేదు. కానీ అలాంటి వారు చరిత్ర గర్భంలో కలిసిపోవడం తప్ప, నేరప్రపంచం మాత్రం మారడం లేదు. అంటే కీలకం ఎక్కడ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. తమ అవసరాల మేరకు కొందరు తయారుచేస్తున్న చీకటి ప్రపంచం ఇది.

మెక్సికో కూడా అలాంటి అడ్డాలలో ఒకటి. గొప్ప నేరాలు కాడినుండి  నేరాల వరకు అక్కడ జరుగుతూనే ఉంటాయి. అయినా ఎవరికి పట్టదు. ఇలా ఉన్న నగరంలో నుండి వెళ్లిపోవడం అంటే అంత సులభం కూడా కాదు. తాజాగా ఇక్కడ మనుషులు కనిపించకుండా పోతున్నారని వెలుగులోకి వచ్చింది. దానిపై ఐక్యరాజ్యసమితి కూడా కొన్ని సూచనలు అక్కడ  చేసింది. అయినా అవేమి పట్టవు అక్కడ నేరస్తులకు. కారణం అక్కడ బాధితులు మొరపెట్టుకోవడానికి వెళ్లిన చోట కూడా మాఫియా వాళ్ళే ఉంటారు. ఇక న్యాయం ఎలా జరుగుతుంది. పేరుకు పెద్ద నగరం, కానీ అది నిజానికి చీకటి నేరాలకు అడ్డా. న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇప్పటికైనా పరిస్థితులు మారుతాయా..చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: