ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. పలువురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అంటే సీనియర్ రాజకీయ నేతల నుంచి ... జూనియర్ నేతల వరకు ఎంతో గౌరవం ఉంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించారు. అలాంటి నేత ఇప్పుడు తన కొడుక్కి కూడా కార్పొరేటర్ సీటు ఇప్పించ‌లేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. తాను వైసీపీలో చేరి.. చాలా తప్పు చేశానని బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఆయ‌న ఎవ‌రో కాదు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే.

ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో దశాబ్దాలుగా పట్టు ఉంది. ఆత్మకూరు - నెల్లూరు రూరల్ - నెల్లూరు పట్టణం - వెంకటగిరి - గూడూరు నియోజకవర్గాల్లో వీళ్ల ఫ్యామిలీకు మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆనం కు చంద్రబాబు ఆత్మకూరు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. అయితే చంద్రబాబు తో విభేదించి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే జగన్ ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి ఉండడంతో వెంకటగిరి టికెట్ ఇచ్చారు. అక్కడ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఆనం ఏరోజు సంతృప్తిగా లేర‌నే చెప్పాలి.

సీనియర్ నేతగా ఉన్న ఆనంకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. చివరకు ఆనం వర్గీయులకు కూడా పదవి ఇవ్వలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆనం వర్గానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అటు ఆత్మకూరులోని ఆనం వర్గం వారిని పూర్తిగా పదవులకు దూరంగా పెట్టేశారు. మరోవైపు జగన్ కు చెప్పిన ఆయన కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక త్వరలోనే జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్న సంగతి తెలిసిందే.

అప్పటి వరకు ఎదురు చూసిన ఆనం ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే టీడీపీ బయటికి వచ్చిన  ఆనం ఇప్పుడు మళ్లీ అదే పార్టలోకి ?  వెళ్తారా ?  లేదా ఏం చేస్తారు అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా ఆయన మాత్రం జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: