ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం పేరు చెప్తేనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పాలి. 1978 నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నియోజకవర్గం ఆ ఫ్యామిలీకి కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ ని ఎవరు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. 1978లో తొలిసారిగా ఇక్కడి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే ఆయన మంత్రి పదవి చేపట్టారు. 1978 - 1983 -1985 ఎన్నికల్లో ఎక్కడ నుంచి వరుసగా విజయాలు సాధించారు. 1989 ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు.

1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ పురుషోత్తం రెడ్డి విజయం సాధిస్తే... 1994లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి మరోసారి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తిరిగి వైఎస్ రాజశేఖరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇక 2004 - 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుసగా విజయాలు సాధించారు. 2010లో వైఎస్ మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఆ తరువాత జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని స్థాపించడంతో 2011 లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విచిత్రమేంటంటే విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 తో పాటు 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు.

నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా కూడా... ఇక్కడి నుంచి వైయస్సార్ ఫ్యామిలీ మాత్రమే తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తోంది. అలా పులివెందుల గ‌డ్డ వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: