1971లో నిర్వ‌హించిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న వీరుడు రిటైర్డ్ వైస్ అడ్మిర‌ల్ ఎస్‌.హెచ్‌.శ‌ర్మ సోమ‌వారం మృతి చెందారు. ఒడిశా భువ‌నేశ్వ‌ర్‌లోని ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ  సోమ‌వారం సాయంత్రం 6.20 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఎస్‌.హెచ్‌.శ‌ర్మ కు 100 ఏళ్లు నిండాయ‌ని, వ‌య‌స్సు రిత్యా ఎదురైనా అనారోగ్యానికి చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు అని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఎస్‌.హెచ్‌.శ‌ర్మ 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం స‌మ‌యంలో తూర్పు నౌక‌ద‌ళానికి ఫ్లాగ్ ఆఫీస‌ర్ క‌మాండింగ్‌గా ఉన్నారు. అప్పుడు జ‌రిగిన యుద్ధంలో భార‌త‌దేశం చేతిలో పాకిస్తాన్ ఘోర ప‌రాజ‌యాన్ని పొందిన‌ది. ఈ యుద్ధం అనంత‌రం బంగ్లాదేశ్ అనే స‌రికొత్త దేశం ప్ర‌పంచ‌ప‌టంలో రూపుదిద్దుకున్న‌ది. వైస్ అడ్మిర‌ల్ ఎస్‌.హెచ్‌.శ‌ర్మ తూర్పు నౌకాద‌ళ క‌మాండ్ ఫ్లాగ్ ఆఫీస‌ర్ క‌మాండింగ్ ఇన్ చీఫ్‌గా కూడా ప‌ని చేసార‌ని ఇండియ‌న్ నేవ‌ల్ ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు.  

ఎస్‌.హెచ్‌.శ‌ర్మ భౌతిక కాయాన్ని స్వ‌గృహానికి త‌ర‌లించారు. ప్ర‌జ‌లు నివాళులు అర్పించ‌డానికి వీలుగా ఎస్‌.హెచ్‌.శ‌ర్మ భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నామ‌ని కుటుంబ స‌భ్యులు పేర్కొంటున్నారు. జ‌న‌వ‌రి 05 బుధ‌వారం రోజు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. వైఎస్ అడ్మిర‌ల్ ఎస్‌.హెచ్‌. శ‌ర్మ గ‌త సంవ‌త్స‌రం 2021 డిసెంబ‌ర్ 1వ తేదీన త‌న 100వ పుట్టిన రోజును నిర్వ‌హించుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో నిర్వ‌హించిన ఆజాదీ అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. అయితే అదేరోజు శ‌ర్మ 99వ ఏటా అడుగుపెట్టిన‌ట్టు నేవీ అధికార ప్ర‌తినిధి తెలిపారు.

రిటైర్డు వైస్‌ అడ్మిర‌ల్ ఎస్‌.హెచ్‌. శ‌ర్మ మృతికి సంతాపం తెలుపుతూ ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ట్వీట్ ఒడిషాకు చెందిన ప్ర‌ముఖుల్లో ఒక‌రైనా వైస్ అడ్మిర‌ల్ శ‌ర్మ మ‌ర‌ణం త‌న‌కు చాలా బాధ క‌లిగించ‌ని చెప్పారు. భార‌త‌దేశం కోసం అనేక యుద్ధాలు చేసారంటూ గుర్తు చేసుకున్నారు. శ‌ర్మ కుటుంబ స‌భ్య‌ల‌కు సంతాపం తెలిపారు. భువ‌నేశ్వ‌ర్‌లోని 120 బెటాలియ‌న్ స్టేష‌న్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో వైస్ అడ్మిర‌ల్ శ‌ర్మ మ‌ర‌ణించినందుకు సంతాపం తెలుపుతూ కెప్టెన్ సంజీవ్ వ‌ర్మ ఓ సందేశంలో ఇలా అన్నారు. అత‌ను ఎల్ల‌ప్పుడూ మాకు స్పూర్తినిచ్చేవాడు. భువ‌నేశ్వ‌ర్‌లోని 120 బెటాలియ‌న్ స్టేష‌న్ హెడ్ క్వార్ట‌ర్స్‌లో కెప్టెన్ సంజీవ్ శ‌ర్మ త‌న సందేశంలో పేర్కొన్నారు. శ‌ర్మ ఫాగ్ ఆఫీస‌ర్ క‌మాండింగ్ ఇన్ చీఫ్‌గా బంగాళ‌ఖాతంలో భార‌త‌దేశం ఆక్ర‌మ‌ణ వ్యూహాన్ని రూపొందించ‌డంలో ముఖ్య‌పాత్ర పోషించారంటూ గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: