భారత పధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ తన కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ కారిడార్ ను గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ లోని కాశీ నుంచి మోడీ పార్లమెంట్ కు  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాశీ పుణ్యక్షేత్రం సుప్రసిద్ధమైనది కావడంతో  కాశీ విశ్వనాథ్ కారిడార్ ను నిర్మించారు. తాజాగా ఆయన కాశీ వాసులకు ఓ కానుకను పంపించారు. ఇది ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్య పోవడం  ఖాయం
భారత ప్రధాన మంత్రి నరెంద్ర మోడీ, దేశంలో ని పన్నెండు బిజేపి పాలిత  రాష్ట్రాల ముఖ్యమంత్రులు  గత ఏడాది డిసెంబర్ లో కాశీ విశ్వనాథ్  కారిడార్ ను ప్రారంభించారు. అంతే కాకుండా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల లోనూ పాల్గోన్నారు. ఒక రోజు అర్థరాత్రి సమయంలో కాశీ రైల్వే స్టేషన్ అంతటా కలియదిరిగారు. అక్కడి స్థానికులతో సంభాషించారు. విశ్వనాథ్ కారిడార్ ప్రారంభం అనంతరం అక్కడ పని చేసిన కార్మికులతో చాలా సేపు గడిపారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.  వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు. ఎందరో మహానుభావులు, సాధువులు తిరుగాడిన నేల లో తాను పర్యటించడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కోన్నారు.  భావి భారత పౌరులను తీర్చిదిద్దేది విద్య మాత్రమే నని పేర్కోంటూ బాలికా విద్య ఆవస్యకతను నోక్కి చెప్పారు.కాశీ య్తాత్ర ముగించుకుని వచ్చిన తరువాత ఆయన  పరిపాలనా పరమైన పనుల్లో చాలా బిజీగా గడిపారు. మధ్య మధ్యలో ఉత్తర ప్రదేశ్ తో పాటు,  ఉత్తరాది రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గోన్నారు. అయినా ఆయన తాను అనుకున్న పని విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించ లేదు. కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులలో భాగస్వాములైన  వారికి ఆయన ఒక కానుకను ఇవ్వాలని ఆనాడు భావించారు.  తాజాగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  కారిడార్ పనుల్లో పాల్గోన్న వారికి  దాదాపు వంద మందికి  జూట్ తో తయారు చేసిన పాదరక్షలను పంపించారు. ఈ విషయాన్ని ఏఎన్ ఐ వార్త సంస్థ ధృవీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: