మహబూబ్ నగర్ జిల్లా : బాలానగర్ మండల కేంద్రం ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యే లు లక్ష్మా రెడ్డి, ఆ ల వెంకటేశ్వర్ రెడ్డి,టీఎస్ఎమ్మెస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి,సంగీత నాటక అకాడెమీ చైర్మన్ శివ కుమార్,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ..  కరొనా కేసులు పెరిగితే ఆసుపత్రి ఉపయోగపడుతుంది..లక్ష్మా రెడ్డి గొప్ప మార్పులు వైద్య ఆరోగ్య శాఖ లో తీసుకొచ్చారు..డాక్టర్ గా ఉండి సీఎం కేసీఆర్ నాయకత్వం లో పని చేసారని గుర్తు చేసుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు...ఈ ప్రాంతం నుండి అనేక మంది మంత్రులుగా పని చేసి వలసల జిల్లాగా మార్చారన్నారు. 

కాంగ్రెస్,టీడీపీ వాళ్ళు లక్షలాది మంది వలసలకు కారణం అయ్యారు..సాగునీటి రంగం లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గణనీయంగా ప్రగతి సాధించింది...ఉమ్మడి జిల్లా లో ఒక్క మెడికల్ కాలేజి కూడా లేదు..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మూడు మంజూరు చేయడం జరిగింది...ఇప్పటికే మహబూబ్ నగర్ లో మెడికల్ కాలేజి పూర్తి అయిందన్నారు.  రెండు వందల కోట్ల రూపాయలతో 900 పడకల ఆసుపత్రి మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేస్తామని.. కేంద్రం తెలంగాణ  కు ఒక్కటి కూడా మెడికల్ కాలేజి ఇవ్వలేదని పేర్కొన్నారు.  వైద్య రంగం లో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంక్ లో తెలంగాణ మూడో స్థానం లో ఉంది...బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉందని చురకలు అంటించారు...ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు..అన్ని స్కూళ్లలో మౌళిక వసతుల కల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.మన ఊరు మన బడి కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: