అమిన్ పూర్ ఫ్యామిలీ సూసైడ్ అప్డేట్

అమిన్ పూర్ ఫ్యామిలీ సూసైడ్ కేస్ లో దర్యాప్తు ను వేగవంతం చేశారు పోలీసులు. దర్యాప్తు లో కీలక విషయాలు తెలుసుకున్న పోలీసులు.. 4 రోజుల క్రితం అమిన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ కుటుంబం అనుమాస్పద మృతి చెందిన విషయం తెలిసిందే.  కూతురు శ్రీ స్నిగ్ద ,భార్య అనామిక తో సహా భర్త శ్రీకాంత్ మృతి చెందిన వార్త తెలిసిందే. ముగ్గురి మృతదేహాలకు నెత్తుట్టి బొట్లు,దేవుడు ఫోటోలు బోర్లించి  ఉండటం తో సస్పెన్స్ గా మారిన కేసు.. టెక్నికల్ ఆధారాలను సేకరించి కీలక విషయాలను గుర్తించారు పోలీసులు.. చనిపోయే నెల రోజుల నుండి గూగుల్ లో ఎలా చనిపోవాలి అని సెర్చ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు..శ్రీకాంత్ కరోనా కారణంగా 4,5 నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నాడు అని దర్యాప్తు లో తెలుసుకున్నారు పోలీసులు.. పలు మార్లు ఫైనాన్సెర్స్ నుండి కాల్స్ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు...ఫైనాన్స్ కట్టేందుకు డబ్బులు లేవని ఫైనాన్సెర్స్ కు శ్రీకాంత్ మెయిల్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు..


మొబైల్ లో ఉన్న డిటైల్స్ ని మొత్తం ఫార్మాట్ చేసిన శ్రీకాంత్... నెల క్రితమే tcs లో శ్రీకాంత్ జాయిన్ అయినట్లు చెప్తున్నారు పోలీసులు.. ఆర్థిక సమస్యల వలన చనిపోయి ఉంటారు అని చెప్తున్నారు పోలీసులు... శ్రీకాంత్,అనామిక ల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవు...2 రోజుల నుండి కాల్ లిఫ్ట్ చేయకపోవడం తో అమిన్పూర్ వెళ్ళామన్నారు శ్రీకాంత్ గౌడ్ ఫ్యామిలీ సభ్యులు. అప్పటికే 3 చనిపోయి ఉన్నారని చెప్పారు శ్రీకాంత్ గౌడ్ ఫ్యామిలీ సభ్యులు.. డబ్బులు సరిపోవట్లేదు అని మరొక జాబ్ చూసుకోవాలి అని తల్లి కి చెప్పిన శ్రీకాంత్... ఆ తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అమిన్ పూర్ ఫ్యామిలీ సూసైడ్ ఇంకా పోలీసులు దర్యాప్తును చేస్తునే ఉన్నారు.  అతి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్‌ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: