హోంమంత్రి శ్రీమతి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో టీడీపీకి చెందిన నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలి అయిన 14 ఏళ్ళ చిన్నారి ఘటన చాలా బాధాకరం. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసున్న బాలికను 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయడం మనసును తీవ్రంగా కలచివేసిందన్నారు.
తన బాధను బయటకు చెప్పుకోలేక బాలిక ఎంత మనో వేదనకు గురైందో.. తాను రాసిన సూసైడ్ నోట్ ను చూస్తేనే అర్థమవుతుంది. బాలిక తనపై జరిగిన లైంగిక వేధింపులను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరం. ఇటువంటి వారి కోసం, మహిళల భద్రత కోసమే ఈ ప్రభుత్వం దిశ యాప్ తీసుకురావడంతో పాటు ఎన్నో చర్యలు చేపట్టింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని సూచిస్తున్నాను. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దిశ యాప్ కు సమాచారం ఇచ్చిన తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు.

అంతేగాని భయాందోళనకు గురై అమ్మాయిలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. సీఎం జగన్ గారు తీసుకువచ్చిన దిశ యాప్ ను ఇప్పటికే దాదాపు కోటికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్ స్టేషన్లను, మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్ అఫెండర్స్ పై నిఘా పెట్టి, వారి చర్యలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్ చేశాము. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరం జరిగిన వెంటనే, పారదర్శకంగా విచారణ జరిపి చార్జిషీటు వేయడం జరుగుతోంది.
లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నాము. జాతీయ స్థాయిలో చూసుకుంటే.... తక్కువ సమయంలోనే ఛార్జ్ షీట్ వేసి, దర్యాప్తు పూర్తి చేస్తున్న ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్లో దాదాపు 98 శాతం చార్జిషీట్లు వేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: